Vivek Ranjan Agnihotri : కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.. ఈసారి ‘వ్యాక్సిన్ వార్’ అంటున్నాడు.. స్వతంత్ర దినోత్సవం టార్గెట్..

Kaburulu

Kaburulu Desk

November 10, 2022 | 07:38 AM

Vivek Ranjan Agnihotri : కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.. ఈసారి ‘వ్యాక్సిన్ వార్’ అంటున్నాడు.. స్వతంత్ర దినోత్సవం టార్గెట్..

Vivek Ranjan Agnihotri :  బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి మంచి సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటారు. ఇటీవల తాశ్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్.. అంటూ సున్నితమైన అంశాలని, అందులో నిజానిజాల్ని తెరకెక్కిస్తూ వాటి గురించి ప్రజలకి తెలియచేస్తున్నారు. దీంతో ఈయన చేసే సినిమాలు ఓ వైపు వివాదాలు సృష్టిస్తున్నాయి. మరో వైపు ఈ సినిమాలు మంచి విజయం సాధించి కోట్లు కురిపిస్తున్నాయి.

ఇటీవల వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వివేక్ రంజాన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అంతా ఎదురు చూశారు. తాజాగా కశ్మీర్ ఫైల్స్ నిర్మాతతోనే తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు వివేక్ రంజాన్ అగ్నిహోత్రి. తన తాజా సినిమా టైటిల్ ని ప్రకటించి ఓ ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Janhvi Kapoor : నాకు సోషల్ మీడియా నుంచి డబ్బులొస్తున్నాయి.. అందుకే అలాంటి ఫోటోలు పెడుతున్నాను..

ఈ సారి ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సరికొత్త సినిమాతో రాబోతున్నారు వివేక్. ఒక వ్యాక్సిన్ బాటిల్ ఉన్న పోస్టర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ”మీ అందరికి తెలియని ఇండియా పోరాడిన ఒక అద్భుతమైన నిజాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాము. సైన్స్, ధైర్యం, విలువలతో ఇండియా గెలిచింది. ఈ సినిమా 2023 ఇండిపెండెన్స్ డే రోజు 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది” అని తెలిపారు వివేక్ రంజన్. దీంతో ఈ సినిమాలో ఏం చూపిస్తారా అని ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది.