Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్‌ పార్ట్-2 ప్రోమో వచ్చేసింది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా విడుదల చేస్తూ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చింది ఆహా టీం. ఇటీవలే ఈ ఎపిసోడ్ పార్ట్-1 ని విడుదల చేయగా.. వింటేజ్ ప్రభాస్ ని చూస్తూ అలా మైమరచిపోయారు అందరూ. కాగా ఈ ఎపిసోడ్ పార్ట్-2 ని జనవరి 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 09:28 PM

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్‌ పార్ట్-2 ప్రోమో వచ్చేసింది..

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా విడుదల చేస్తూ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చింది ఆహా టీం. ఇటీవలే ఈ ఎపిసోడ్ పార్ట్-1 ని విడుదల చేయగా.. వ్యూయర్స్ తాకిడికి ఆహా సైట్ క్రాష్ అయ్యింది. అయితే ఎట్టకేలకు ఏదోకటి చేసి ఎపిసోడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు షో నిర్వాహుకులు. ఇక ఆ ఎపిసోడ్ చూసిన అభిమానుల ఆనందాలకు అయితే హద్దులు లేవు.

Prabhas : కృతి‌సనన్‌తో ఏమి లేదు.. అనవసరంగా రాస్తున్నారు.. ప్రభాస్!

వింటేజ్ ప్రభాస్ ని చూస్తూ అలా మైమరచిపోయారు అందరూ. కాగా ఈ ఎపిసోడ్ పార్ట్-2 ని జనవరి 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. మొదటి భాగంలో మొహమాటంగా కనిపించిన ప్రభాస్ ఈ రెండో భాగంలో మాత్రం చాలా హుషారుగా, కొంటిగా కనిపిస్తున్నాడు. అలాగే ఈ ఎపిసోడ్ లో బాహుబలి సినిమా విషయాలను కూడా పంచుకున్నాడు.

ప్రోమో మొదటిలో గోపీచంద్‌తో ప్రభాస్.. ‘ఏదైనా ఫుల్ గా చెప్పు, సగం సగం చెప్పకు’ అంటూ వార్నింగ్ ఇస్తుంటే బాలయ్య ఎంటర్ అయ్యి.. ‘నీ టెన్షన్ చూస్తుంటే నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతున్నట్లు ఉంది. నువ్వు వార్నింగ్లు ఇవ్వకు అతని మాట్లాడనివ్వు’ అంటూ బాలయ్య తిరిగి వార్నింగ్ ఇవ్వడం. ప్రోమో చూస్తుంటే మొదటి భాగం కంటే ఈ సెకండ్ పార్ట్ ఎంటెర్టైమెంట్ ఎక్కువుగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.