Pawan – Charan : చరణ్‌ ఎక్కువ మాలలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్?

పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందో అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణకి తెరపడింది. ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. కాగా ఈ మొదటి భాగంలో బాలకృష్ణ.. పవన్ అండ్ రామ్ చరణ్ ల దైవభక్తి గురించి ప్రశ్నించాడు.

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 10:12 AM

Pawan – Charan : చరణ్‌ ఎక్కువ మాలలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్?

Pawan – Charan : ప్రముఖ ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి సీజన్ సూపర్ హిట్ గా నిలవగా, సెకండ్ సీజన్ అంతకు మించి హిట్ గా నిలిచింది. కాగా ఈ సీజన్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పవర్ ఫుల్ గా ఎండింగ్ పలుకుతున్న సంగతి తెలిసిందే. పవన్, బాలయ్య టాక్ షో కి వస్తున్నాడు అంటే అభిమానులతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకుంది. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందో అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణకి తెరపడింది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఏమి చెప్పాడో తెలుసా?

ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి బాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. ఈ ఫస్ట్ పార్ట్ లో పవన్ సినిమాలు, ఫ్యామిలీ గురించే ఎక్కువుగా ప్రశ్నించాడు బాలకృష్ణ. మరి సెకండ్ ఎపిసోడ్ లో రాజకీయ విషయాలు చర్చకు రావొచ్చు. కాగా ఈ మొదటి భాగంలో బాలకృష్ణ.. పవన్ అండ్ రామ్ చరణ్ ల దైవభక్తి గురించి ప్రశ్నించాడు.

నువ్వు ధ్యానం, పూజలు ఎక్కువుగా చేస్తావు కదా? నీకు దైవ భక్తి ఎక్కువ కదా? అంటూ బాలకృష్ణ ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ బదులిస్తూ.. నేను మొదటిలో విగ్రహారాధన చేసే వాడిని కాదు. దైవాన్ని నమ్మే వాడిని కానీ, దీపం పెట్టుకొని ధ్యానం, యోగా లాంటివి చేసేవాడ్ని. అవి చేస్తూ లోకంతో సంబంధం లేకుండా ఉండేవాడిని. అది గమనించిన ఒక గురువు.. నన్ను విగ్రహారాధన చేయమన్నారు. అప్పటి నుంచి దుర్గ దేవిని పూజించడం మొదలు పెట్టాను. దేవుడ్ని నమ్ముతాను, భక్తి ఉంది పూజలు చేస్తాను, కానీ మరీ ఎక్కువుగా చేయను అంటూ బదులిచ్చాడు.

ఆ తరువాత బాలకృష్ణ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కి కూడా భక్తి ఎక్కువ కదా. ఎప్పుడు ఎద్దొక మాలలో ఉంటాడు. అతనికి దైవభక్తి కలగడానికి కారణం నువ్వేనా? అని ప్రశించగా, పవన్ బదులిస్తూ.. లేదు, వాడి స్వతహాగానే భక్తి కలిగింది. నా దగ్గర నుంచి నేర్చుకోలేదు. సంవత్సరంలో 200 రోజులు ఏదొక మాలలోనే ఉంటాడు అంటూ బదులిచ్చాడు.