Project-K : మోడరన్ విష్ణు మూర్తి అవతారంలో ప్రభాస్.. ప్రాజెక్ట్-K నిర్మాత అశ్వినీ దత్!

ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ ప్రాజెక్ట్-K. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్ ల్లో ఎక్కడ సినిమా థీమ్ ఏంటి అనేది బయటపడకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. కాగా ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో..

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 04:40 PM

Project-K : మోడరన్ విష్ణు మూర్తి అవతారంలో ప్రభాస్.. ప్రాజెక్ట్-K నిర్మాత అశ్వినీ దత్!

Project-K : ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ ప్రాజెక్ట్-K. వైజయంతి మూవీస్ బ్యానర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఈ చిత్రాన్ని సి అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్ ల్లో ఎక్కడ సినిమా థీమ్ ఏంటి అనేది బయటపడకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. కాగా ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Pawan Kalyan : పవర్ స్టార్ – సుప్రీం హీరో సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసా?

ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫాంటసీ కథతో ఆధునిక విష్ణు మూర్తి అవతారం గురించి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే యాక్షన్ పరంగానే కాకుండా మనసుని కదిలించే భావోద్వేగాలు కూడా ఉంటాయి అంటూ తెలియజేశాడు. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో మోడరన్ విష్ణు మూర్తిగా కనిపించబోతున్నాడా? అనే సందేహం మొదలయింది అందరిలో. గతంలోనూ ఈ సినిమాలో ప్రభాస్ విష్ణు మూర్తి దశావతారం కల్కి పాత్ర చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నిర్మాత కూడా విష్ణు మూర్తిని లింక్ చేస్తూ మాట్లాడడంతో ఆ వార్తలు నిజమనేలా ఉన్నాయి.

ఇక ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూనే.. ఇప్పటికే 70% పైగా ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతుందని, VFX వర్క్ చాలా సమయం పడుతుందని తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న దీపికా పదుకొణె మరియు అమితాబ్ బచ్చన్ షూటింగ్ పార్ట్‌లు కూడా 7-10 రోజుల్లో పూర్తి అవుతుంది అంటూ తెలియజేశాడు. అలాగే ఈ సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్ లు ఉంటాయని, చాలా మంది స్టార్స్ ఈ మూవీలో భాగం కాబోతున్నారు అంటూ వెల్లడించాడు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.