Pathaan : అయిదు రోజుల్లో 550 కోట్లు.. కలెక్షన్ల మోత మోగిస్తున్న పఠాన్..

ఠాన్ సినిమా కల్క్షన్స్ లో దుమ్ము దులుపుతుంది. పఠాన్ సినిమా ముందు నుంచే కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు సెట్ చేస్తుంది. సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు వసూలు చేసింది. ఇక మొదటి...................

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 02:16 PM

Pathaan : అయిదు రోజుల్లో 550 కోట్లు.. కలెక్షన్ల మోత మోగిస్తున్న పఠాన్..

Pathaan :  పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. పాత కథే అయినా, స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేయడం, ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండటం, షారుఖ్ చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో కనపడటంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కి పరుగులు తీస్తున్నారు. గత వారం రోజులుగా, వచ్చే వారం కూడా ఏ సినిమా పరిశ్రమలో వేరే పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో పఠాన్ కి మరింత కలిసొచ్చింది.

Pooja Hegde Brother Marriage : ఘనంగా పూజాహెగ్డే అన్నయ్య వివాహం.. మరి బుట్టబొమ్మది ఎప్పుడో?

దీంతో పఠాన్ సినిమా కల్క్షన్స్ లో దుమ్ము దులుపుతుంది. పఠాన్ సినిమా ముందు నుంచే కలెక్షన్స్ తో సరికొత్త రికార్డు సెట్ చేస్తుంది. సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు వసూలు చేసింది. ఇక మొదటి రోజు 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్ ఇప్పుడు అయిదు రోజుల్లో ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక్క ఆదివారం రోజే దాదాపు 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఈ కలెక్షన్స్ చూసి షారుఖ్ అభిమానులు, బాలీవుడ్ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ ని టార్గెట్ పెట్టుకొని పఠాన్ దూసుకెళ్తుంది అంటున్నారు. ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూసి కింగ్ ఈజ్ బ్యాక్, బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు.