Project K : రెండు భాగాలుగా ప్రభాస్ ప్రాజెక్ట్-K?

రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రెజెంట్ సలార్, ప్రాజెక్ట్-K, మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా ప్రాజెక్ట్-K గురించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 07:14 PM

Project K : రెండు భాగాలుగా ప్రభాస్ ప్రాజెక్ట్-K?

Project K : రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రెజెంట్ సలార్, ప్రాజెక్ట్-K, మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా ప్రాజెక్ట్-K గురించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మహానటి ఫేమ్ నాగవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. వైజయంతి మూవీస్ పతాకం పై సి అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని వంటి బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ నటిస్తుంది.

Prabhas : ప్రభాస్ సినిమాలో టైగర్ ష్రాఫ్..

కాగా ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది అంటూ ఒక వార్త ఫిలిం సర్కిల్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2024లో రిలీజ్ చేస్తామని గతంలో మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీని రెండు భాగాలుగా చిత్రీకరించాలని మేకర్స్ భావిస్తుండడంతో ఈ డేట్ మారే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి రెండు భాగాలు గురించి, కొత్త డేట్ గురించి అనౌన్స్ చేస్తారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇక ఆదిపురుష్ సినిమా ఏమో ఈ ఏడాది ఆగష్టులో కచ్చితంగా విడుదల అవుతుంది అంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు అని సమాచారం. మారుతీ డైరెక్షన్ లో వస్తున్న హారర్ కామెడీ ఫిలిం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ రెండు సినిమాల విడుదల తేదీల పై మూవీ టీమ్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.