Adipurush : ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆదిపురుష్ వచ్చేస్తున్నాడు..

ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Kaburulu

Kaburulu Desk

March 30, 2023 | 07:34 PM

Adipurush : ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆదిపురుష్ వచ్చేస్తున్నాడు..

Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్నిటి పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు అందుకోలేకపోతే ప్రేక్షకులు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. రాధేశ్యామ్ విషయంలో ఇదే జరిగింది. ఫలితం భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత ప్రభాస్ నుంచి ఆడియన్స్ ముందుకు వస్తున్న మరో చిత్రం ‘ఆదిపురుష్’. మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా రామాయణ కథాంశంతో తెరకెక్కుతుంది. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, కృతి సనన్ సీతగా కనిపించబోతుంది.

Salaar Update from Italy media.. Prabhas Range!

ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ మూవీ విషయంలో కూడా మేకర్స్ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయారు. రిలీజ్ చేసిన మొదటి టీజర్ లో VFX వర్క్ బాగోలేదంటూ భారీగా ట్రోలింగ్ ఎదురుకున్నారు. అంతేకాదు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ టీజర్ కోర్ట్ వరకు వెళ్ళింది. దీంతో మూవీ టీం రీ వర్క్ కోసం సమయం తీసుకోని వెన్నకి వెళ్ళింది. ఇక ఈ సినిమాని జూన్ 16న రిలీజ్ చేస్తామంటూ అప్పుడే ప్రకటించారు. కాగా రిలీజ్ దగ్గర పడుతున్నా చిత్ర యూనిట్ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆదిపురుష్ మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో జూన్ 16కే వస్తున్నట్లు తెలియజేశారు. ఇక పోస్టర్ చూస్తుంటే.. మునపటి పోస్టర్స్ కంటే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. మరి ఎంతవరకు మార్పులు జరిగాయో తెలియాలి అంటే టీజర్ లేదా ట్రైలర్ వస్తే గాని చెప్పలేము. అలాగే ఇప్పటి నుంచి అయినా అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ మొదలు పెడతారా? లేదా? చూడాలి. కాగా ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నాగే చేస్తున్నారు.