Adipurush : ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమా రే గ్రాఫిక్ వర్క్ కోసం ఆరు నెలలు సమయం తీసుకున్నారు చిత్ర యూనిట్. జూన్ 16, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అంటూ ఇంతకు ముందు ప్రకటించారు మేకర్స్. అయితే..

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 05:10 PM

Adipurush : ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై క్లారిటీ  ఇచ్చిన నిర్మాతలు..

Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’. తెలుగు పురాణ కథ అయిన రామాయణం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ కనిపిస్తుంది. లంకాధిపతి రావణాసురుడు పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. తానాజీ వంటి సూపర్ హిట్ పిరియాడికల్ మూవీ తెరకెక్కించిన ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రాముడి కథ కావడంతో ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

Prabhas : ప్రభాస్ సినిమాలో టైగర్ ష్రాఫ్..

ఇన్ని అంచనాల మధ్య ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీజర్ లోని విజువల్స్ కార్టూన్ ఛానల్ లోని బొమ్మలులా ఉన్నాయి అంటూ తీవ్ర విమర్శలు ఎదురుకుంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమానే అసలు? అంటూ ప్రశ్నలు ఎదురుకుంది. అంతేకాదు హిందూ ధర్మాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అంటూ విమర్శలు ఎదురుకుంది. ఈ వ్యతిరికేత వల్ల ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయ్యి వెనక్కి వెళ్ళింది.

తమ తప్పుని సరిదిద్దుకొని మంచి గ్రాఫిక్స్ తో వచ్చేందుకు ఆరు నెలలు సమయం తీసుకుంది. మంచి అవుట్ పుట్ తో సినిమాని జూన్ 16, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అంటూ ఇంతకు ముందు ప్రకటించారు మేకర్స్. అయితే గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా లేట్ అవుతున్నాయి. ఆ డేట్ కి రిలీజ్ అవ్వడం కష్టం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై చిత్ర యూనిట్ స్పదించింది.

సినిమా రిలీజ్ కి ఇంకా 150 రోజులు సమయం ఉంది అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ బట్టి ఆదిపురుష్ జూన్ 16న విడుదల కావడం పక్కా అంటూ తెలియజేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని మాట్లాడుతూ.. దాదాపు సినిమా అంతా బ్లూ స్క్రీన్ ఔటింగ్ అని చెప్పాడు. ప్రస్తుతం, వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి టీం రీవర్క్ చేస్తుంది. ఈసారి తప్పకుండా ప్రేక్షకుల అంచనాలని అందుకుంటాం అంటూ వెల్లడించాడు.