ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మూవీ 'సలార్'.
ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ హైప్ నెలకుంది.
దీంతో ఈ మూవీ అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ మూవీ నుంచి తాజా అప్డేట్ ఒకటి మీడియాకి వచ్చింది.
అయితే అది ఇండియన్ మీడియాలో కాదు, ఇటలీ దేశంలోని మీడియాలో వచ్చింది.
తరువాత షెడ్యూల్ కోసం సలార్ ఇటలీ వెళ్లబోతుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటలీ మీడియా.. ప్రభాస్ సలార్ షూటింగ్ జరుపుకోడానికి ఇటలీ వస్తున్నారు అంటూ న్యూస్ రాసుకొచ్చారు.
ప్రభాస్ గురించి ఇతర దేశ మీడియా కూడా ఆసక్తి చూపించడంతో రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.