Narendra Modi : సినిమాల పై విమర్శలు చేయకండి అంటూ నేతలకి మోడీ సూచన..

గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాల పై సాధారణ ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీని పై ప్రధాని నరేంద్ర మోదీ స్పదించినట్లు తెలుస్తుంది.

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 06:31 PM

Narendra Modi : సినిమాల పై విమర్శలు చేయకండి అంటూ నేతలకి మోడీ సూచన..

Narendra Modi : గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాల పై సాధారణ ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు భారతీయ సంస్కృతిని, ఇతిహాసాలను కించ పరిచేలా తీస్తున్నారు అంటూ వివాదం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ పఠాన్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ రెండు చిత్రాలు తీవ్ర విమర్శలు అందుకోవడమే కాకుండా కోర్ట్ లో కేసు నమోదు అయ్యే వరకు వెళ్ళింది.

Adipurush : ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..

ఇక ఈ రెండు సినిమాల్లో భారతీయ ఇతిహాసాలను దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ మత సంఘాలతో పాటు బీజేపీ నాయకులు కూడా వివాదం సృష్టిస్తున్నారు. తాజాగా దీని పై ప్రధాని నరేంద్ర మోదీ స్పదించినట్లు తెలుస్తుంది. సినిమాలపై ప్రతికూల, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ నేతలు, మంత్రులు, కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని స్ట్రెయిట్ గా సినిమాలు అంటూ ప్రస్తావించి చెప్పలేదు మోడీ.

అసందర్భ సమస్యల పై వాగ్వాదాల చేస్తూ పలువురు నాయకులు మీడియా దృష్టిలో పడుతున్నారు. అటువంటి చర్యలకు ఇక పై పాల్పడకండి అంటూ ఈరోజు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ నాయకులను ఉద్దేశించి మోడీ మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి నిరసనలతో సినీ నిర్మాతలను బెదిరించడం తీవ్ర దుమారాన్ని లేపింది. దీంతో మోడీ ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే పఠాన్ సినిమాని రిలీజ్ కానివ్వం అంటూ మత సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇటీవల గుజరాత్ లోని ఒక థియేటర్ ని బజరంగ్ దళ్ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పఠాన్ సినిమాని మీ థియేటర్ లో రిలీజ్ చేస్తే థియేటర్లు నాశనం చేస్తాము అంటూ ఓనర్లకు వార్నింగ్ లు ఇచ్చారు. మరి దీని పై కూడా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.