Sunil : రజినీకాంత్ సినిమాలో విలన్‌గా సునీల్..

రజినీకాంత్ హీరోగా బీస్ట్ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జైలర్'. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ నటుడు సునీల్ నటిస్తున్నాడు.

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 05:46 PM

Sunil : రజినీకాంత్ సినిమాలో విలన్‌గా సునీల్..

Sunil : టాలీవుడ్ నటుడు సునీల్.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు తెలుగు తెర పై స్టార్ కామెడియన్ గా రాజ్యమేలిన సునీల్.. హీరోగా టర్న్ తీసుకోని పలు సినిమాల్లో కథానాయకుడిగా చేశాడు. అయితే హీరోగా అంత సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో సునీల్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అంటే.. అది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప అనే చెప్పాలి.

Adipurush : ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..

ఈ సినిమాలో సునీల్.. మంగళం శీనుగా విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. విలనిజాన్ని సునీల్ పలికించిన తీరు ఇండస్ట్రీలోని పలువురు దర్శకులను కూడా ఆకట్టుకుంది. దీంతో ఏకంగా సూపర్ స్టార్ సినిమాలోనే విలన్ పాత్ర అందిపుచ్చుకున్నాడు. రజినీకాంత్ 169వ చిత్రంగా వస్తున్న మూవీ ‘జైలర్’. డాక్టర్, బీస్ట్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సునీల్ ని తీసుకున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో సునీల్ యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్నాడు. పుష్ప సినిమాలో విలన్ గా అదరగొట్టిన సునీల్ ఈ మూవీలో కూడా ఆ విలనిజాన్ని పండిస్తాడా అనేది చూడాలి. గతంలో సునీల్, రజినీకాంత్ కథానాయకుడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

కాగా ‘జైలర్’ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నరసింహ చిత్రం తరువాత మళ్ళీ ఇప్పుడు రజినితో కలిసి నటిస్తుంది రమ్యకృష్ణ. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.