Prabhas : ప్రభాస్ సినిమాలో టైగర్ ష్రాఫ్..

గత కొన్ని రోజులుగా ప్రభాస్ కొత్త సినిమాల గురించి వరుస వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ పఠాన్ దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో..

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 06:14 PM

Prabhas : ప్రభాస్ సినిమాలో టైగర్ ష్రాఫ్..

Prabhas : గత కొన్ని రోజులుగా ప్రభాస్ కొత్త సినిమాల గురించి వరుస వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసేశాడు ప్రభాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక సలార్, ప్రాజెక్ట్-K, మారుతీతో చేస్తున్న సినిమాలు సెట్ పైన ఉన్నాయి. ఒక మూవీ షెడ్యూల్ తరువాత మరో షెడ్యూల్ లో పాల్గొంటూ వీలైనంత త్వరగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Prabhas : ప్రభాస్‌కి కోపం వచ్చినప్పుడు ఆ పని చేస్తాడు.. గోపీచంద్!

ఇక ఈ సినిమాలు కాకుండా కార్డ్స్ మీద ఉన్న సినిమాలు.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ, దిల్ రాజు నిర్మాణంలో ప్రశాంత్ నీల్ తో మరో సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ సినిమా ఒకటి. కాగా సిద్దార్ద్ ఆనంద్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ బాలీవుడ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ తో తీయబోయే సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా భాగం కాబోతున్నట్లు గూగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన హృతిక్ రోషన్ ‘వార్’ సినిమాలో టైగర్ ష్రాఫ్ కూడా నటించాడు. ఇప్పుడు ప్రభాస్ తో తెరకెక్కించబోయే సినిమాలో కూడా దర్శకుడు టైగర్ ష్రాఫ్ ని తీసుకుంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సిద్దార్ద్ ఆనంద్ తెరకెక్కించిన ‘పఠాన్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీని బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు నిర్మాత. ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటి సారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేశాడు.