Deepika Padukone : ఆస్కార్ నుంచి ఇండియాకి మరో గౌరవం.. ఆస్కార్ ప్రజెంటర్స్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికా టైం ప్రకారం మార్చ్ 12 రాత్రి జరగగా ఇండియన్ టైం ప్రకారం మార్చ్ 13 తెల్లవారుజామున జరగనున్నాయి. ఈ వేడుకల్లో మన తెలుగు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి నాటు నాటు పర్ఫార్మెన్స్ లైవ్ లో పాడనున్నారు. దీంతో..................

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 03:47 PM

Deepika Padukone : ఆస్కార్ నుంచి ఇండియాకి మరో గౌరవం.. ఆస్కార్ ప్రజెంటర్స్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Deepika Padukone :  ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులు ఇండియన్స్ కి మరింత ఆసక్తికరంగా మారాయి. మన RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లి నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో నివ్వడంతో పాటు, ఇండియా నుంచి ఓ షార్ట్ ఫిలిం, ఓ డాక్యుమెంటరీ ఫిలిం కూడా ఆస్కార్ రేసులో నిలిచాయి. దీంతో ఈ సారి ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఇండియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికా టైం ప్రకారం మార్చ్ 12 రాత్రి జరగగా ఇండియన్ టైం ప్రకారం మార్చ్ 13 తెల్లవారుజామున జరగనున్నాయి. ఈ వేడుకల్లో మన తెలుగు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి నాటు నాటు పర్ఫార్మెన్స్ లైవ్ లో పాడనున్నారు. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Manchu Manoj Marriage : నేడే మంచు మనోజ్ రెండో పెళ్లి.. ఎవరితోనో తెలుసా?? ఫోటో షేర్ చేసిన మనోజ్..

మరో గుడ్ న్యూస్ ని ఆస్కార్ నిర్వాహకులు ఇండియన్స్ కి అందించారు. తాజాగా అకాడమీ సంస్థ ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటర్స్ లిస్ట్ ని ప్రకటించింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు ఉండటం విశేషం. దీనిపై దీపికా సంతోషం వ్యక్తం చేసింది. ఆస్కార్ ప్రజెంటర్స్ లో దీపికా పదుకొనే పేరు ఉండటంతో బాలీవుడ్ ప్రేక్షకులు, దీపికా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ఆస్కార్ వేడుకల్లో దీపికా RRR యూనిట్ తో కలిసి కనిపిస్తుందో లేదో చూడాలి.