Prabhas : కృతి‌సనన్‌తో ఏమి లేదు.. అనవసరంగా రాస్తున్నారు.. ప్రభాస్!

Kaburulu

Kaburulu Desk

December 30, 2022 | 04:40 PM

Prabhas : కృతి‌సనన్‌తో ఏమి లేదు.. అనవసరంగా రాస్తున్నారు.. ప్రభాస్!

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురు చూసారు. అయితే అందులో ఎక్కువ మంది ప్రభాస్, కృతిసనన్‌తో ఉన్న రిలేషన్ గురించి బాలయ్య అడుగుతాడా? అడిగితే ప్రభాస్ చెబుతాడా? అని వెయిట్ చేశారు. అనుకున్నట్లే బాలకృష్ణ ఆ ప్రశ్న అడిగాడు. కృతిసనన్‌కి నీకు మధ్య ఏముంది అనేది నువ్వు ఇప్పుడు చెప్పకపోతే షో అర్దాంతరంగా ఆగిపోతుంది అంటూ బాలకృష్ణ గట్టిగా క్యూస్షన్ చేశాడు.

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది..

దీంతో ప్రభాస్.. ‘అదేముంది సార్, అది ఆల్రెడీ ఓల్డ్ న్యూస్. వచ్చేసిందిగా ఏమి లేదని’ అని చెప్పాడు. దీనికి బాలయ్య.. లేదని వాళ్ళు చెప్పారు మనం చెప్పాలి కదా. మేడం చెప్పేసిందిగా సార్ ఏమి లేదని అని ప్రభాస్ చెప్పగా, ఆవిడతో అలా చెప్పించారు అని కౌంటర్ వేశాడు బాలయ్య. అలాంటిది ఏమి లేదు సార్ మేడమే చెప్పింది అని ప్రభాస్ అన్నాడు.

అది విన్న బాలయ్య.. మేడం ఏంటి అంత రొమాన్స్ ఉందా మీ మధ్య అని క్యూస్షన్ చేశాడు. మేడం అనడంలో రొమాన్స్ ఏముంది సార్ అని ప్రభాస్ తిరిగి ప్రశ్నించగా.. మేడంలోనే ఉంది అమ్మ. నేను నా భార్యని ‘వసు మేడం వసు మేడం’ అనే పిలుస్తా అని బదులిచ్చాడు. చివరిగా బాలకృష్ణ.. నువ్వేమో నవ్వుతూ నో అంటున్నావు, ఆ అమ్మాయి సీరియస్ గా నో అంటుంది అసలు మీ ఇద్దరి మధ్య ఏముందో చెప్పేసేయ్ అని అడిగాడు.

‘మీ టైంలో మీకు సోషల్ మీడియా లేదు కాబట్టి మీకు ఏ ఇబ్బందులు లేవు సార్. ఇప్పుడు మాకు ఏ సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో అనవసరంగా రాస్తున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసుగా సార్’ అంటూ కృతిసనన్ తో రిలేషన్ వార్తలు ఫేక్ అని తేల్చేశాడు.