Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఏమి చెప్పాడో తెలుసా?

పవన్, బాలయ్య టాక్ షో కి వస్తున్నాడు అంటే అభిమానులతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకుంది. ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి బాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. ఈ ఫస్ట్ పార్ట్ లో..

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 09:42 AM

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఏమి చెప్పాడో తెలుసా?

Pawan Kalyan : ప్రముఖ ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి సీజన్ సూపర్ హిట్ గా నిలవగా, సెకండ్ సీజన్ అంతకు మించి హిట్ గా నిలిచింది. కాగా ఈ సీజన్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పవర్ ఫుల్ గా ఎండింగ్ పలుకుతున్న సంగతి తెలిసిందే. పవన్, బాలయ్య టాక్ షో కి వస్తున్నాడు అంటే అభిమానులతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకుంది. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందో అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణకి తెరపడింది.

Taraka Ratna: తారకరత్న విదేశాలకి తరలింపు.. ఇంతకీ హెల్త్ స్టేటస్ ఏంటి?

ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి బాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. ఈ ఫస్ట్ పార్ట్ లో పవన్ సినిమాలు, ఫ్యామిలీ గురించే ఎక్కువుగా ప్రశ్నించాడు బాలకృష్ణ. మరి సెకండ్ ఎపిసోడ్ లో రాజకీయ విషయాలు చర్చకు రావొచ్చు. కాగా ఈ మొదటి భాగంలో బాలయ్య, పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రశ్నించాడు. దాని గురించి నిన్ను విపరీతంగా విమర్శిస్తున్నారు కదా, ఈరోజు దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అంటూ బాలకృష్ణ కోరాడు.

పవన్ మాట్లాడుతూ.. నిజానికి నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఒంటరిగా ఉండిపోదాం అని అనుకున్నాను. కానీ ఫ్యామిలీ వల్ల మొదటి పెళ్లి చేసుకున్నాను. అయితే మా ఇద్దరికీ కుదరలేదు, విబేధాలు వచ్చాయి. అందుకనే విడాకులు తీసుకోని చట్ట పరంగా విడిపోయాం. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకున్నాను, అప్పుడు కూడా విబేధాలు రావడం వల్లే విడాకులు తీసుకోని విడిపోయాం. నేను మళ్ళీ అనుకోకుండా మూడో పెళ్లి చేసుకున్నాను.

అయితే నేను ఈ మూడు పెళ్లిళ్లు వ్యామోహంతో చేసుకోలేదు. మా మధ్య సఖ్యత కుదరక విడాకులు తీసుకోని చట్టపరంగా చేసుకున్నాను. ఈ విషయం గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే ఇష్టం పరంగానే విడిపోయాం కాబట్టి. కానీ వీళ్లంతా అంటుంటే, అది ఎలా ఉంది అంటే.. నేను ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకున్నాను అన్నట్లు మాట్లాడుతున్నారు. నేను ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదురా బాబు.. కుదరక విడిపోయిన తరువాత మరొకరిని చేసుకొన్నాను.

నన్ను విమర్శించే వాళ్ళ జీవితంలో కూడా నాలాంటి సంఘటనలు ఉన్నాయి. వాటిని నేను కూడా విమర్శించవచ్చు. కానీ మన విమర్శ వల్ల వాళ్ళ ఇంటిలో ఆడవాళ్లు ఎంత బాధపడతారో అని నేను ఆలోచిస్తా, అదే నన్ను ఆపేస్తుంది. అయినా రాజకీయంలో విమర్శించడానికి ఏదోకటి కావాలి కదా. నా విషయంలో అది వాళ్లకి ఆయుధంలా మారింది. దాని గురించి నేను పెద్దగా బాధ పడడం లేదు అంటూ బదులిచ్చాడు. ఇక ఈ మాటలు విన్న బాలకృష్ణ.. ఇంకోసారి పెళ్లిళ్ల గురించి విమర్శించిన వాళ్ళు ఊరకుక్కతో సమానం అంటూ వార్నింగ్ ఇచ్చాడు.