Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ ఆగిపోయిందా?

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 06:04 PM

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ ఆగిపోయిందా?

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ‘లైగర్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటకట్టుకొని విజయ్ కెరీర్ పై ప్రభావం చూపించింది. మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కింది. పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ చిత్రం అదే స్థాయిలో అప్పులు కూడా మిగిలిచింది.

Vijay Devarakonda : లైగర్ ఫ్లాప్ తర్వాత మొదటిసారి మాట్లాడిన విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న స్పీచ్

ఇటీవల ఈ సినిమా నిర్మాణంలో.. డబ్బులు విదేశాలు నుంచి వచ్చాయి అంటూ ‘ఈడీ’ దర్శకనిర్మాతలతో పాటు హీరో విజయ్ ని కూడా ప్రశ్నించింది. ఇక విషయానికి వస్తే విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే లవ్ అండ్ రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మూవీ.

అయితే సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేకపోతుంది. ఆమె తిరిగి మళ్ళీ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటుందో క్లారిటీ లేకపోవడంతో విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించే ఆలోచనలో ఉన్నాడట. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ ఓ సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు విజయ్, గౌతమ్. దీంతో ఖుషి సినిమా సంగతి అయోమయంలో పడింది.