Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ!

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 03:50 PM

Balakrishna : మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ’ పేరుని నాన్న ఇక్కడే పెట్టారు.. బాలకృష్ణ!

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఒకపక్క వరుస సినిమాలు, మరోపక్క అన్‌స్టాపబుల్ షో, సమయం దొరికినప్పుడు తమ బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా సర్వీస్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తాజాగా బాలయ్య కాచిగూడలో ఉన్న తమ ‘తారకరామ’ థియేటర్ ని పున ప్రారభించాడు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఆ థియేటర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

Unstoppable2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది..

“1978లో ‘తారకరామ’ అని అమ్మానాన్నల పేరుతో ఈ థియేటర్ ని ప్రారంభించాం. మా కుటుంబానికి ఇది దేవాలయంతో సమానం. అంతేకాదు మా అబ్బాయికి ‘మోక్షజ్ఞ తారక రామ తేజ’ అనే పేరుని మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఈ థియేటర్ లోనే పెట్టారు. అటువంటి ఈ థియేటర్ ని మళ్ళీ పున ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మంచి కథలతో తెలుగు సినీపరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి” అంటూ వ్యాఖ్యానించాడు.

కాగా బాలయ్య ఈ థియేటర్ ని ఏషియన్ గ్రూప్స్ తో కలిసి పున ప్రారంభిస్తున్నాడు. దీంతో ఈ థియేటర్ కి ‘ఏషియన్ తారకరామ’ అనే పేరుని పెట్టారు. గతంలో మహేష్ బాబుతో ‘AMB’ అంటూ థియేటర్ స్టార్ట్ చేసిన ఏషియన్ సంస్థ తాజాగా అల్లు అర్జున్ తో కలిసి అమిర్‌పేట్ లోని సత్యం థియేటర్ ని మారుస్తూ ‘AAAA’ మొదలుపెట్టారు. మరి కొత్త హంగులతో ఈ ఓల్డ్ థియేటర్స్ ఎలా ఉండబోతున్నాయి చూడాలి.