Prabhas : సమంత కంటే ముందు ఆ హీరోయిన్ సేవ్ చేస్తా.. ప్రభాస్!

ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య ప్రభాస్ తో కలిసి ఒక సరదా గేమ్ ఆడాడు. ఆ ఆటలో బోర్డు మీద ఇద్దరు హీరోయిన్‌లను చూపిస్తూ ప్రభాస్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు.

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 05:11 PM

Prabhas : సమంత కంటే ముందు ఆ హీరోయిన్ సేవ్ చేస్తా.. ప్రభాస్!

Prabhas: టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్‌ని మిస్ అవుతున్న ఎంతోమంది అభిమానులకు మళ్ళీ వింటేజ్ ప్రభాస్‌ని చూపించిన షో.. బాలయ్య అన్‌స్టాపబుల్. ఈ షోకి ప్రభాస్ వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్‌స్టాపబుల్ షోకి విపరీతమైన రీచ్ వచ్చింది. మరి అంత హైప్ ఉన్న ఎపిసోడ్ ని నార్మల్ గా ప్లాన్ చేస్తే సరిపోదుగా, అందుకే రెండు ఎపిసోడ్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Prabhas : ప్రభాస్‌కి కోపం వచ్చినప్పుడు ఆ పని చేస్తాడు.. గోపీచంద్!

న్యూ ఇయర్ టైంలో మొదటి భాగాన్ని రిలీజ్ చేసిన షో నిర్వాహకులు.. నేడు సెకండ్ పార్ట్ ని కూడా విడుదల చేశారు. ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. దీంతో బాలయ్య ఈ ఇద్దరి స్నేహితులతో కలిసి సెకండ్ పార్ట్ ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా సాగించాడు. ఈ క్రమంలోనే బాలయ్య ఒక సరదా గేమ్ పెట్టాడు. ఈ ఆటలో బోర్డు మీద ఇద్దరు హీరోయిన్‌లను చూపిస్తూ ప్రభాస్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు.

మొదటిగా నయనతార, తమన్నాని చూపిస్తూ.. ‘వీరిద్దరిలో ఎవరితో షాపింగ్ చెయ్యాలని ఉంది’ అని అడిగాడు బాలయ్య. ‘ఇద్దరితో చెయ్యాలని ఉంది’ అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. ఆ తరువాత శ్రద్ధా కపూర్, పూజా హెగ్దే చూపించి ఎవరితో సినిమాకి వెళ్తావు అని అడిగాడు. ఎవరితోనూ వెళ్ళాను అన్నాడు ప్రభాస్.

అలాగే అనుష్క శెట్టి, కృతి సనన్ ఇద్దరిలో ఎవరితో డేటింగ్ లో ఉన్నావు అంటే నమ్ముతారు అని ప్రశ్నించగా.. ‘ఎవరితో ఉన్నాను అన్న నమ్మరు’ అంటూ బదులిచ్చాడు. కానీ ఆడియన్స్ మాత్రం అనుష్క అంటూ బదులిచ్చారు. ఇక చివరిగా సమంత, దీపికా పదుకొనె వీళ్ళిద్దరూ సముద్రంలో పడిపోతే ఫస్ట్ ఎవర్ని కాపాడతావు అని క్యూస్షన్ చేయగా.. ‘ప్రెజెంట్ దీపికా ప్రాజెక్ట్-K చేస్తుంది. ఆమె లేకపోతే షూటింగ్ ఆగిపోతుంది కాబట్టి ఆమెనే కాపాడుతాను’ అంటూ తెలివిగా బదులిచ్చాడు.