Milk : ఏ రకమైన పాలు తాగితే మంచిది?

ఉదయం లేచిన తరువాత అందరూ ముందుగా కాఫీ, టీ లేదా పాలు తాగుతుంటారు. పాలల్లో ఉండే క్యాల్షియం మన ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. అంటే అందరికి పాలు కావాలి. అయితే ఇప్పుడు పాలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి...........

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 05:00 PM

Milk : ఏ రకమైన పాలు తాగితే మంచిది?

Milk :  ఉదయం లేచిన తరువాత అందరూ ముందుగా కాఫీ, టీ లేదా పాలు తాగుతుంటారు. పాలల్లో ఉండే క్యాల్షియం మన ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. అంటే అందరికి పాలు కావాలి. అయితే ఇప్పుడు పాలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి టెట్రా ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పాలు, గేదె పాలు, ఆర్గానిక్ పాలు. గ్రామాల్లో మాత్రమే గేదె పాలు దొరుకుతాయి పట్టణాలలో గేదె పాలు దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలు అందరూ వాడుకుంటూ ఉంటారు. వీటిలో ఏ రకమైన పాలు మన ఆరోగ్యానికి మంచిదో మనం తెలుసుకోవాలి.

* టెట్రా ప్యాకెట్ పాలు:-
ఈ పాలను కొంత సమయం పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద బాగా వేడి చేస్తారు. తరువాత పూర్తిగా చల్లార్చి ప్యాకింగ్ చేస్తారు. ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉండేలా చేస్తారు కాబట్టి దీనిని ప్యాకింగ్ చేసేటప్పుడు పాలల్లో ఉండే రోగకారక క్రిములను తొలగిస్తారు. ఆరు పొరలతో పాలను ప్యాకింగ్ చేస్తారు. ఇలా చేయడం వలన పాలు తొందరగా పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడవు.

* ప్యాకెట్ పాలు:-
ఈ పాలు అందరూ వాడేవే వీటిని కూడా ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. కానీ ఈ పాలు ఎక్కువ కాలం నిలువ ఉండవు. ఇవి కూడా ఏదో తాగాలి కాబట్టి తాగడమే తప్ప ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడవు.

* ఆర్గానిక్ పాలు:-
ఈ మధ్య ఆర్గానిక్ పాలను చాలా మంది తాగుతూ ఉన్నారు. ఆర్గానిక్ పాలు అంటే పాలిచ్చే గేదెలకు, ఆవులకు ఆర్గానిక్ ఫుడ్ ను తినిపిస్తారు, రసాయనాలు కలపనివి వాటికి ఆహారంగా ఇస్తారు. దీంతో అవి ఇచ్చేపాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పాలు.

* గేదె పాలు:-
గేదె పాలు డైరెక్ట్ గా తాగితే మన ఆరోగ్యానికి మంచిది కానీ కొంతమంది వాటిలో నీళ్ళు కలిపి అమ్ముతుంటారు. నీళ్ళు కలపనివి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన ఆరోగ్యపరంగా చూసుకుంటే గేదె పాలు మన ఆరోగ్యానికి మంచివి మనకు దొరకని పరిస్థితుల్లో ప్యాకెట్ పాలు వాడుకోవాల్సిందే. ఐతే ఏ రకమైన పాలు వాడుకున్న వాటిని వేడి చేసుకున్న తరువాత వాడుకోవాలి.

Toys Cleaning : చిన్న పిల్లల బొమ్మల్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసా..??

ఇక ఆవుపాలు కూడా అప్పుడప్పుడు మనం వాడతాము. కానీ అవి రోజువారీ తాగము. ఇటీవల ఆరోగ్యానికి మంచిదని కొంతమంది మేక పాలు, గాడిద పాలు కూడా వాడుతున్నారు. మొత్తంగా గేదె పాలు, ఆవు పాలు అయితే ఆరోగ్యానికి చాలా మంచివి. రోజూ తాగడం వల్ల స్ట్రాంగ్ గా తయారవుతాము.