Kushi : ఖుషి రిలీజ్ రెడీ.. విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..
విజయ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత ఎన్నో హోప్స్ తో రాబోతున్న సినిమా ఖుషి. సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో షూటింగ్ మొదలై సమంతకు మాయోసైటిస్ రావడంతో.................

Kushi : విజయ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత ఎన్నో హోప్స్ తో రాబోతున్న సినిమా ఖుషి. సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో షూటింగ్ మొదలై సమంతకు మాయోసైటిస్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది ఈ సినిమా. ఇటీవల సమంత మళ్ళీ షూటింగ్స్ కి కంబ్యాక్ ఇవ్వడంతో ఖుషి సినిమా షూట్ రీసెంట్ గానే మొదలైంది.
ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వినాయక చవితి కానుకగా 1 సెప్టెంబర్ 2023న ఖుషి సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ లైగర్ తో బాగా దెబ్బ తిని ఉన్నాడు, కచ్చితంగా విజయ్ కి ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇక సమంత గత సంవత్సరం యశోద సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. త్వరలో ఏప్రిల్ లో శాకుంతలం సినిమాతో రాబోతుంది. ఇప్పుడు సెప్టెంబర్ లో ఖుషి అనౌన్స్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉంది సమంత. దర్శకుడు శివ నిర్వాణ కూడా గత సినిమా టక్ జగదీశ్ పరాజయం చెందడంతో ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు.
పూర్తిగా లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో విజయ్, సమంత కాంబో కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ చేయబోతున్నారు. అసలే పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ వాడుకుంటున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023