Prabhas : ప్రభాస్‌కి కోపం వచ్చినప్పుడు ఆ పని చేస్తాడు.. గోపీచంద్!

ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ప్రభాస్ అన్‌స్టాపబుల్ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయ్యిపోయింది. ఇక ప్రభాస్ గురించి ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియజేసిన బాలయ్య.. ప్రభాస్‌కి కోపం వస్తే ఏమి చేస్తాడో అనేది కూడా బయటపెట్టాడు.

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 04:41 PM

Prabhas : ప్రభాస్‌కి కోపం వచ్చినప్పుడు ఆ పని చేస్తాడు.. గోపీచంద్!

Prabhas : టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్‌ని మిస్ అవుతున్న ఎంతోమంది అభిమానులకు మళ్ళీ వింటేజ్ ప్రభాస్‌ని చూపించిన షో.. బాలయ్య అన్‌స్టాపబుల్. ఈ షోకి ప్రభాస్ వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్‌స్టాపబుల్ షోకి విపరీతమైన రీచ్ వచ్చింది. మరి అంత హైప్ ఉన్న ఎపిసోడ్ ని నార్మల్ గా ప్లాన్ చేస్తే సరిపోదుగా, అందుకే రెండు ఎపిసోడ్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Prabhas : ఆ సినిమా చూశాక యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యా.. ప్రభాస్!

న్యూ ఇయర్ టైంలో మొదటి భాగాన్ని రిలీజ్ చేసిన షో నిర్వాహకులు.. నేడు సెకండ్ పార్ట్ ని కూడా విడుదల చేశారు. ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. దీంతో బాలయ్య ఈ ఇద్దరి స్నేహితులతో కలిసి సెకండ్ పార్ట్ ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా సాగించాడు. ఇక ప్రభాస్ గురించి ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియజేసిన బాలయ్య.. ప్రభాస్‌కి కోపం వస్తే ఏమి చేస్తాడో అనేది కూడా బయటపెట్టాడు.

బాలయ్య ఇద్దరు స్నేహితులను.. మీకు కోపం వస్తే ఏమి చేస్తారు అని ప్రశ్నించాడు. దానికి బదులుగా ప్రభాస్, గోపీచంద్ కోపం గురించి మాట్లాడాడు. ‘గోపీచంద్ కి అసలు కోపం, చిరాకు రాదు. చాలా ఓపిక ఎక్కువ. ఒకసారి గోపీచంద్ ముక్కుపై గాయం అయ్యి బ్లడ్ వస్తున్న సమయంలో నేను వాడిని నవ్వుతూ కొట్టినా, వాడు కూల్ గా మాట్లాడాడు’ అంటూ తెలియజేశాడు.

ఇక గోపీచంద్ ప్రభాస్ కోపం గురించి చెప్పుకొచ్చాడు. ‘ప్రభాస్‌కి కోపం వచ్చినప్పుడు అందర్నీ గెట్ అవుట్ అంటాడు. అందర్నీ దూరంగా వెళ్ళిపోమని, వాడు ఒంటరిగా కూర్చొని సిగరెట్ తాగుతాడు’ అని చెప్పుకొచ్చాడు. అయితే సిగరెట్ అన్న విషయం డైరెక్ట్ గా కాకుండా సైగలు ద్వారా తెలియజేశాడు.