Prabhas : పెదనాన్న చనిపోయినప్పుడు నేను పక్కనే ఉన్నాను.. ఎమోషనల్ అయిన ప్రభాస్..

ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో కృష్ణంరాజుకు నివాళ్లు అర్పించారు. ఆ తరువాత ప్రభాస్, కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 05:32 PM

Prabhas : పెదనాన్న చనిపోయినప్పుడు నేను పక్కనే ఉన్నాను.. ఎమోషనల్ అయిన ప్రభాస్..

Prabhas : టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్‌ని మిస్ అవుతున్న ఎంతోమంది అభిమానులకు మళ్ళీ వింటేజ్ ప్రభాస్‌ని చూపించిన షో.. బాలయ్య అన్‌స్టాపబుల్. ఈ షోకి ప్రభాస్ వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్‌స్టాపబుల్ షోకి విపరీతమైన రీచ్ వచ్చింది. మరి అంత హైప్ ఉన్న ఎపిసోడ్ ని నార్మల్ గా ప్లాన్ చేస్తే సరిపోదుగా, అందుకే రెండు ఎపిసోడ్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Prabhas : సమంత కంటే ముందు ఆ హీరోయిన్ సేవ్ చేస్తా.. ప్రభాస్!

న్యూ ఇయర్ టైంలో మొదటి భాగాన్ని రిలీజ్ చేసిన షో నిర్వాహకులు.. నేడు సెకండ్ పార్ట్ ని కూడా విడుదల చేశారు. ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. దీంతో బాలయ్య ఈ ఇద్దరి స్నేహితులతో కలిసి సెకండ్ పార్ట్ ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా సాగించాడు. కాగా ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపిసోడ్ లో ఆయనకు నివాళ్లు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకి శాంతి కలగని కోరుకున్నారు.

ఆ తరువాత గతంలో కృష్ణంరాజు ప్రభాస్ ని పొగిడిన వీడియోలను, అలాగే ప్రభాస్ అండ్ కృష్ణంరాజు సినిమాలో నుంచి కొన్ని సిమిలర్ సీన్స్ తో ఎడిట్ చేసిన వీడియోని కూడా ప్లే చేశాడు బాలయ్య. ఇక ప్రభాస్, కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ.. ‘ఇంటిలో వద్దన్నా సినీ పరిశ్రమకి వచ్చి, మొదటి కష్టాలు వచ్చినా, వాటిని ఎదురుకొని ఈ స్థాయికి ఎదిగారు. ఆయన లేకపోతే మా కుటుంబం లేదు. ఆయన చనిపోయే నెల ముందు నుంచే ఆరోగ్యం బాగోలేదు. చనిపోయిన రోజు కూడా నేను పక్కనే ఉన్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకొన్నాడు ప్రభాస్.