Kalyaneshwar Temple:ఇక్కడి శివలింగంకు అభిషేకం చేసిన నీరు, పాలు కనిపించవు….!

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 06:12 PM

Kalyaneshwar Temple:ఇక్కడి శివలింగంకు అభిషేకం చేసిన నీరు, పాలు కనిపించవు….!

భారతదేశంలో కొలువైన అనేక దేవాలయాలు ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటాయి. కొన్ని దేవాలయాలలో జరిగే అద్భుతాలను శాస్త్రవేత్తలు సైతం చేధింలేక పోతున్నారు. అలాంటి దేవాలయాలలో ఒకటి కళ్యాణేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం పై చేసిన అభిషేక పదార్థాలైన పాలు, నీరు కనిపించకపోవడం విశేషం. మరి ఈ దేవాలయం ఎక్కడుందో, దాని చరిత్ర ఏమిటో ఇపుడు తెలుసుకుందాం…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల హాపూర్ జిల్లాలో ఉన్న గ్రహముక్తేశ్వర్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కళ్యాణేశ్వర మహాదేవ్ ఆలయం ఉంది. ఇది పురాణాలు, అద్భుతాలకు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో గల శివలింగానికి చేసిన అభిషేక పదార్థాలు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియనటువంటి మిస్టరీగా మిగిలిపోయింది. మొఘల్ సామ్రాజ్య కాలంలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ ని మొగల్ చక్రవర్తి బంధించడంతో శివాజీ ఈ ఆలయంలో చేసిన యాగాల ఫలితంగా ధైర్యం వచ్చి అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించాదని చారిత్రక కథనాలు చెబుతున్నాయి.
పురాణాలలో గల ప్రసిద్ధ నలమహారాజు ఈ ఆలయంలోని శివుడికి అభిషేకం చేయగా ఆ నీరు ఎటు వెళుతుందో గమనించాడు. కానీ విషయం అర్థం కాక వేలకొద్ది కుండలతో జలాభిషేకం చేయడం ప్రారంభించాడు. అయినా విషయం అర్థం కాకపోవడంతో మహారాజు భక్తి పారవశ్యంలో మునిగిపోయి శివుడికి నమస్కారం చేసి వెనుదిరిగాడు. ఈ ఆలయంలోనే పాండవులు యజ్ఞాలు చేసి శాప విముక్తి పొందారని కూడా పురాణ కథనాలు చెబుతున్నాయి.