Shakunthalam Trailer : శాకుంతలం ట్రైలర్ రిలీజ్.. పురాణ కథని విజువల్ వండర్‌లా చూపించిన గుణశేఖర్..

ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తాజాగా శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో శకుంతల.........

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 03:59 PM

Shakunthalam Trailer : శాకుంతలం ట్రైలర్ రిలీజ్.. పురాణ కథని విజువల్ వండర్‌లా చూపించిన గుణశేఖర్..

Shakunthalam Trailer :  సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం. పురాణాల్లోని దుశ్యంతుడు, శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. మరికొంతమంది ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ బాబు దూర్వాస మాహర్షిగా కనిపించబోతున్నాడు. ఇక అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.

ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తాజాగా శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో శకుంతల ఎలా భూమి మీదకి వచ్చింది, ఓ ఆశ్రమంలో ఎలా పెరిగింది, దుశ్యంతుడిని ఎలా కలిసింది, దుశ్యంతుడు ఆమెని ఎలా అవమానించాడు అనే అంశాలతో పాటు రాక్షసులకు, దేవుళ్ళకు యుద్ధం, శకుంతల పడిన కష్టాలు చూపించారు. ఇది అందరికి తెలిసిన కథే కావడంతో ట్రైలర్ లోనే కథ చూపించేశారు. ఇక ట్రైలర్ చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ గ్రాండ్ గా చూపించారు.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్యలో రవితేజ, చిరుకి తమ్ముడు.. కోన వెంకట్!

ఇక విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉండబోతున్నాయి. ట్రైలర్ లోనే బాహుబలికి మించి విజువల్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. గుణశేఖర్ ఈ సినిమాని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నట్టు అర్ధమవుతుంది. సినిమా కోసం సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా 3D లో కూడా రిలీజ్ కాబోతుంది. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా చాలా నెలల తర్వాత సమంత మీడియా ముందుకి వచ్చింది.