Samantha : సమంత ఏంటి ఇలా అయిపోయింది.. చాలా రోజుల తర్వాత మీడియాకి చిక్కిన సామ్..

తాజాగా శుక్రవారం నాడు ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరికి షాకిచ్చింది సమంత. ముంబై ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ గ్లాస్ పెట్టుకొని వైట్ డ్రెస్ లో బ్యాగ్ పట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళింది. కొంతమంది సామ్ తో.......

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 06:04 PM

Samantha : సమంత ఏంటి ఇలా అయిపోయింది.. చాలా రోజుల తర్వాత మీడియాకి చిక్కిన సామ్..

Samantha :  సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ లో తన యశోద సినిమా రిలీజయింది. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. యశోద సినిమా సమయంలోనే తనకి మయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సమంత. దీంతో ఆమె అభిమానులతో పాటు అందరూ సమంత త్వరగా కోలుకోవాలని కోరారు.

యశోద సమయంలో ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూలో తప్ప మళ్ళీ బయట కానీ, మీడియాలో కానీ కనపడలేదు సమంత. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా లేదు. ఇంటి దగ్గరే ఉంటూ మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుందని కుటుంబ సభ్యులు గతంలో తెలిపారు. గురువారం నాడు శాకుంతలం సినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది సామ్.

Prabhas : పెదనాన్న చనిపోయినప్పుడు నేను పక్కనే ఉన్నాను.. ఎమోషనల్ అయిన ప్రభాస్..

తాజాగా శుక్రవారం నాడు ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరికి షాకిచ్చింది సమంత. ముంబై ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ గ్లాస్ పెట్టుకొని వైట్ డ్రెస్ లో బ్యాగ్ పట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళింది. కొంతమంది సామ్ తో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు. చాలా రోజుల తర్వాత సమంత కనపడటంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత ముంబై ఎయిర్ పోర్ట్ లో నడుస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సమంత కొంచెం బక్కగా అవ్వడం, ఫేస్ లో అసలు కళ లేకపోవడం, డల్ గా ఉండటంతో అందరూ సమంత ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడుతున్నారు. మరి ఆమె ఇంకా కోలుకుందా లేదా అనేది తెలియదు.