Samantha : ఎట్టకేలకు షూటింగ్స్ మొదలుపెట్టిన సమంత.. హెల్త్ ఓకేనా??

త్వరలో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సామ్. అయితే సమంత షూట్ కి వెళ్లి చాలా కాలం అయింది. చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో.........

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 09:41 AM

Samantha : ఎట్టకేలకు షూటింగ్స్ మొదలుపెట్టిన సమంత.. హెల్త్ ఓకేనా??

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత నవంబర్ లో యశోద సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. ఆ సినిమా రిలీజ్ సమయంలోనే తనకు మాయోసైటిస్ వ్యాధి వచ్చిందని చెప్పి అందర్నీ షాక్ కి గురి చేసింది. అప్పట్నుంచి చికిత్స తీసుకుంటూ ఇంటివద్దే ఉంటుంది సమంత. ఇటీవలే శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చాలా రోజుల తర్వాత మీడియా ముందు కనపడింది సమంత.

త్వరలో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సామ్. అయితే సమంత షూట్ కి వెళ్లి చాలా కాలం అయింది. చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో షూట్స్ కి బ్రేక్ ఇచ్చింది. సమంత ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె నటిస్తున్న సినిమాలు, సిరీస్ లు ఆగిపోయాయి. ఇటీవలే మీడియా ముందుకి రావడంతో త్వరలోనే షూటింగ్స్ కి వస్తుందని భావించారు. అయితే మళ్ళీ తన ఆరోగ్యం గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు సమంత.

Balakrishna : వీరసింహుని విజయోత్సవ సభలో ఏపీ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ పంచులు వేసిన బాలయ్య..

సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ ఒకటి. ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్ రాజ్ &డీకే దర్శకత్వంలో హాలీవుడ్ లో వచ్చిన సిటాడెల్ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో వరుణ్ ధావన్, సమంత మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ ముంబైలో మొదలుపెట్టినట్టు సమాచారం. సమంత ఈ షూట్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. దీంతో సమంత చాలా రోజుల తర్వాత సెట్ లోకి అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి సినిమా షూట్ కూడా మొదలవ్వనున్నట్టు సమాచారం. సమంత బ్యాక్ టు వర్క్ అని చెప్తున్నా తన హెల్త్ గురించి అప్డేట్స్ ఏమి ఇవ్వకపోవడంతో హెల్త్ ఓకేనా కాదా అని ఆలోచిస్తున్నారు.