Adivi Sesh : హిట్ 2 ట్రైలర్.. హంతకుడు ఎవరు..? సస్పెన్స్ తో హిట్ ఖాయం..

Kaburulu

Kaburulu Desk

November 23, 2022 | 07:25 AM

Adivi Sesh : హిట్ 2 ట్రైలర్.. హంతకుడు ఎవరు..? సస్పెన్స్ తో హిట్ ఖాయం..

Adivi Sesh :  అడివిశేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే మేజర్ సినిమాతో భారీ విజయం సాధించాడు. ఇప్పుడు మరో సినిమాతో హిట్ కొట్టడానికి వస్తున్నాడు. గతంలో నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రాబోతుంది. ఇందులో అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇటీవలే టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. తాజాగా హిట్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కూడా ఒక అమ్మాయిని ఎవరు చంపారు అని కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాడు హీరో, అయితే చంపింది ఒక్క అమ్మాయిని కాదు, చాలా మంది అమ్మాయిలని అని తెలిసి షాక్ అవుతాడు. మరి హీరో హంతకుడిని పెట్టుకున్నాడా, ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలోనే చూడాలి.

Chiranjeevi : చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు.. మోడీతో సహా అంతటా అభినందనలు..

ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా మంచి సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా ఉండబోతుందని తెలుస్తుంది. హిట్ సినిమా కూడా ఇలాగే సస్పెన్స్ అంశాలతో ఉండి మంచి విజయం సాధించడంతో ఇప్పుడు హిట్ 2 ట్రైలర్ చూసిన తర్వాత దీనిపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో అడివిశేష్ మరో హిట్ గ్యారెంటీ అని, నానికి నిర్మాతగా కూడా మంచి విజయం వస్తుందని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది.