Nani : సుకుమార్ పై నాని కామెంట్స్.. విమర్శిస్తున్న ఫ్యాన్స్.. సినిమాలో నిజంగా తాగి యాక్టింగ్ చేశాను..

ప్రస్తుతం నాని, చిత్రయూనిట్ దసరా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇండియా అంతా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. తాజాగా తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించగా............

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 10:31 AM

Nani : సుకుమార్ పై నాని కామెంట్స్.. విమర్శిస్తున్న ఫ్యాన్స్.. సినిమాలో నిజంగా తాగి యాక్టింగ్ చేశాను..

Nani :  న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చ్ 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. మొదటి సారి నాని పూర్తి మాస్ పాత్రలో చేయడం, నాని ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నాని కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి.

 

ప్రస్తుతం నాని, చిత్రయూనిట్ దసరా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇండియా అంతా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. తాజాగా తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించగా అనేక ఆసక్తికర అంశాలను నాని మీడియాతో పంచుకున్నాడు. అలాగే మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానాలు ఇచ్చాడు. ఈ ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతూ.. సినిమాలో చాలా ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. కొన్ని తాగినప్పుడు చేసే సీన్స్ కూడా ఉండటంతో ఇంకా న్యాచురల్ గా రావాలని డైరెక్టర్ చెప్పడంతో నిజంగానే మందు తాగి యాక్ట్ చేశాను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరి ఆ సీన్స్ సినిమాలో ఎంత బాగా వచ్చాయో చూడాలి.

RC 15 : రామ్ చరణ్ బర్త్‌డేకి.. RC 15 టైటిల్ పక్కా అంటున్న దిల్ రాజు..

అలాగే ఇదే ప్రెస్ మీట్ లో నాని సుకుమార్ పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. నాని మాట్లాడుతూ.. పుష్ప సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేస్తే అందులో ఒక భాషలో మాత్రమే సుకుమార్ గారు పెద్ద డైరెక్టర్. మిగిలిన నాలుగు భాషల్లో సుకుమార్ గారు తెలియదు. మా సినిమా డైరెక్టర్ 5 భాషల్లో కూడా తెలీదు అని అన్నాడు. దీంతో సుకుమార్ అభిమానులు సుకుమార్ వేరే భాషల్లో ఎందుకు తెలీదు అంటూ నానిపై విమర్శలు చేస్తున్నారు.