Nijam with Smita : అన్‌స్టాపబుల్ పోటీగా స్మిత కొత్త టాక్ షో.. చరణ్ పై నాని వైరల్ కామెంట్స్!

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. సినీ, రాజకీయ నాయకులను గెస్ట్ లుగా ఆహ్వానించి బాలయ్య అడిగే ముక్కుసూటి ప్రశ్నలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో టాక్ షో రాబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ 'సోనీ లివ్' ఈ షో ప్రసారం చేయబోతుంది.

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 11:11 AM

Nijam with Smita : అన్‌స్టాపబుల్ పోటీగా స్మిత కొత్త టాక్ షో.. చరణ్ పై నాని వైరల్ కామెంట్స్!

Nijam with Smita : బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. టాక్ షోస్ అన్నిటికి బాప్‌లా నిలిచింది. చంద్రబాబు నాయుడు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో ఈ షో రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సినీ, రాజకీయ నాయకులను గెస్ట్ లుగా ఆహ్వానించి బాలయ్య అడిగే ముక్కుసూటి ప్రశ్నలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో టాక్ షో రాబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘సోనీ లివ్’ ఈ షో ప్రసారం చేయబోతుంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఏమి చెప్పాడో తెలుసా?

తాజాగా ఈ షో ప్రోమోని రిలీజ్ చేశారు నిర్వాహుకులు. ఈ టాక్ షోని ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్ చేయబోతుంది. ఒకప్పుడు తన పాప్ సాంగ్స్ తో యూత్ ని ఉర్రూతలూగించిన స్మిత ఇప్పుడు నిజం నిర్భయంగా బయటపెడతా అంటుంది. ఈ షోకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, పబ్లిక్ సర్వెంట్స్ కూడా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుపాటి, అడివి శేష్, అల్లరి నరేష్, అనిల్ రావిపూడి, సాయి పల్లవి, రాధికా.. ఇలా పలువురు ప్రముఖులు అతిధులుగా వచ్చారు.

ఇక ఈ షోలో స్మిత, బాలయ్యని మించిన ముక్కుసూటి ప్రశ్నలు వేయబోతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి ప్రశ్నించగా.. తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా ఉన్నారు అంటూ బదులిచ్చాడు. అలాగే చిరంజీవి మాట్లాడుతూ.. సినిమాలోకి వద్దాం అనుకున్న సమయంలో నా కులం ఏంటి అని ప్రశ్నించారు. ఇక నాని ని నెపోటిజం గురించి ప్రశ్నించగా, నాని బదులిస్తూ.. రామ్ చరణ్ మొదటి సినిమాని కోటి మంది చూశారు. చూసిన కోటిమంది నెపోటిజాని ప్రోత్సహిస్తున్నట్లే కదా? అంటూ వైరల్ కామెంట్స్ చేశారు. ఇవే కాదు ఉమెన్ అబుసింగ్, స్పోర్ట్స్, నేషనల్ ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ నిజాన్ని నిర్భయంగా చూపించేలా ఉంది ఈ టాక్ షో. ఈ షోకి ‘నిజం విత్ స్మిత’ అనే టైటిల్ తో వస్తున్న ఈ షో ఫిబ్రవరి 10 నుంచి ప్రసారం కాబోతుంది.