Hit 2 : మిలియన్ డాలర్ల మార్క్‌ని అందుకున్న అడివి శేషు..

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 12:47 PM

Hit 2 : మిలియన్ డాలర్ల మార్క్‌ని అందుకున్న అడివి శేషు..

Hit 2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేషు సినిమాలు అంటే ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. అడివి శేషు నుంచి మూవీ వస్తుంది అంటే అది కచ్చితంగా బాగుంటుంది అనే గట్టి నమ్మకాన్ని ప్రేక్షకుల్లో హృదయాల్లో సంపాదించుకున్నాడు ఈ హీరో. తాజాగా ఈ హీరో నుంచి వచ్చిన సినిమా హిట్-2. హిట్ యూనివర్స్ లో ఇది సెకండ్ కేసుగా తెరకెక్కింది.

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ తేరీ రీమేక్‌నా?

వాల్ పోస్టర్ పథకంపై నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ యూనివర్స్ అశేషమైన ప్రేక్షకారాధన అందుకుంటుంది. ఈ నెల 2న విడుదలయిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే మూవీ బడ్జెట్ ని అందుకొని నిర్మాతలను లాభాలు వైపు పరుగులెత్తిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ.39 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి త్రిబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తాజాగా ఈ సినిమా మరో ఘనతని అందుకుంది. అడివి శేషు సినిమాలకు అమెరికాలో కూడా మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్ల వాసులు అందుకొని రికార్డు సృష్టించింది. అలాగే దగ్గరలో పెద్ద సినిమా రిలీజ్ లు కూడా లేకపోవడంతో ఈ మూవీ ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో అని ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు నెటిజెన్లు. కాగా హిట్-3 లో నాని హీరోగా కనిపించబోతున్నట్లు ప్రకటించేశాడు దర్శకుడు.