Chocolates : మూడ్ బాగోలేదా అయితే చాక్లెట్ తినండి..

Kaburulu

Kaburulu Desk

November 22, 2022 | 01:05 PM

Chocolates : మూడ్ బాగోలేదా అయితే చాక్లెట్ తినండి..

Chocolates :  చిన్న పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటారు. కానీ చిన్న పిల్లలే కాదు అందరూ చాక్లెట్స్ తినవచ్చు. అయితే అన్ని చాకోలెట్స్ కాదు. డార్క్‌ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయని, వాటితో మంచి ఆరోగ్యం పొందుతారని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. ఇటీవల దక్షిణకొరియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో చాక్లెట్స్ తింటే మన మూడ్ మంచిగా మారుతుంది అని తెలిసింది.

కాబట్టి మనకు మనసు బాగోలేకపోయినా చాక్లెట్ తింటే మనకు ఉత్సాహం కలుగుతుంది. దానికి కారణం చాకోలెట్‌లో ఉండే పదార్థాలు మన జీర్ణవ్యవస్థలో ఉండి మనకు మేలు చేసే సూక్ష్మజీవులపై చూపే ప్రభావం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా మారతామని వాళ్ల పరిశోధనల్లో వెల్లడైంది.

అందరూ రోజూ కనీసం 30 గ్రాముల చాక్లెట్‌ను తింటే మనుషుల మూడ్స్‌ బాగుపడి మనుషులు చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారనీ, అది పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. డార్క్‌ చాకోలెట్స్ లో ఉండే ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్‌.. క్యాన్సర్లు, మతిమరపు, గుండెజబ్బులు వంటి అనేక సమస్యలను సమర్థంగా నివారిస్తాయని దక్షిణకొరియాలోని సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎకాలజీలోని ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ విభాగం నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.

Afternoon Sleep : మధ్యాహ్నం నిద్ర వస్తుందా.. అయితే ఇలా చేయండి..

దీనికోసం కొంతమందికి రోజు చాకోలెట్స్ ఇస్తూ వాళ్ళ మూడ్స్ ని గమనించి కొన్ని రోజుల పాటు పరిశోధనలు చేశారు. రోజూ మూడు పూటలా చాకోలెట్స్ తిన్నవాళ్ళు చాలా హ్యాపీగా, సానుకూలంగా, సంతోషంగా ఉన్నట్టు తెలిసింది. అందుకే మీ మూడ్ బాగోలేకపోతే చాకోలెట్ తినండి. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కూడా చాకోలెట్ తినండి. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.