Dasara Teaser : బొగ్గు గనుల్లో ఊర నాటు నాని.. దసరా టీజర్ రిలీజ్..

న్యాచురల్ స్టార్ నాని ఇన్నాళ్లు క్లాస్, లవ్, కామెడీ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. కానీ గత కొన్ని రోజులుగా పూర్తిగా మాస్, యాక్షన్ లోకి మారాలని బాగా ట్రై చేస్తున్నాడు. తాజాగా నాని 29వ సినిమా దసరా టీజర్ ని..............

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 06:24 PM

Dasara Teaser : బొగ్గు గనుల్లో ఊర నాటు నాని.. దసరా టీజర్ రిలీజ్..

Dasara Teaser :  న్యాచురల్ స్టార్ నాని ఇన్నాళ్లు క్లాస్, లవ్, కామెడీ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. కానీ గత కొన్ని రోజులుగా పూర్తిగా మాస్, యాక్షన్ లోకి మారాలని బాగా ట్రై చేస్తున్నాడు. తాజాగా నాని 29వ సినిమా దసరా టీజర్ ని రిలీజ్ చేశారు. నాని, కీర్తి సురేష్ జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో దసరా సినిమాని తెరకెక్కిస్తున్నారు.

గోదావరిఖని దగ్గర బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా సినిమా మార్చ్ 30న పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. నేడు దసరా సినిమా టీజర్ ని అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు కూల్ గా కనిపించిన నాని ఈ టీజర్ లో మాస్ విశ్వరూపం చూపించాడు.

Harish Shankar : పవన్ ఫ్యాన్స్ ఎక్కువ చేశారు..అందుకే నేను చెప్పను.. వైరల్ అవుతున్న హరీష్ శంకర్ కామెంట్స్..

టీజర్ లో కథ బొగ్గు గనులు ఉండే ఓ పల్లెటూళ్ళో జరుగుతుందన్నారు. అక్కడ రాజకీయాలు, బొగ్గు కార్మికులతో సాగుతుందన్నట్టు చూపించాడు. నాని ని బాగా ఎలివేట్ చేశారు. తన లుక్స్ మొత్తం ఊర నాటు గా చేంజ్ చేసుకున్నాడు నాని. పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో ఈ సినిమా ఉండబోతుంది. దీంతో డైలాగ్స్ కూడా తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టేసాడు. టీజర్ మొత్తం నాని అన్నట్టే చూపించారు. చివర్లో నాని కత్తితో కోసుకొని బొట్టుపెట్టుకునే సీన్ అయితే అరాచకం. ఆ ఒక్క షాట్ బాగా వైరల్ అవుతుంది. ఎన్నడూ నాని ని ఇలాంటి లుక్స్ లో చూడకపోవడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో నానికి మరో ఊర మాస్ హిట్ గ్యారెంటీ అంటున్నారు.