Hit 2 : ఓటిటికి వచ్చేసిన హిట్-2..

అడివి శేషు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’. థియేటర్‌లో చూసేసిన ప్రేక్షకులు ఈ సినిమాని మరోసారి చూడడానికి ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. కాగా ఈ సినిమాని..

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 09:06 PM

Hit 2 : ఓటిటికి వచ్చేసిన హిట్-2..

Hit 2 : అడివి శేషు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’. ఈ సినిమా హిట్ యూనివర్స్ లో సెకండ్ కేసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్-1 మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ సీక్వెల్ పై రిలీజ్ కి ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.

Hit 2 : మిలియన్ డాలర్ల మార్క్‌ని అందుకున్న అడివి శేషు..

థియేటర్‌లో చూసేసిన ప్రేక్షకులు ఈ సినిమాని మరోసారి చూడడానికి ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. కాగా ఈ సినిమాని పొంగల్ కి ప్రసారం చేస్తారు అనుకున్నారు అందరూ, కానీ ఎటువంటి ప్రకటన లేకుండా ఇవాళే (జనవరి 3) స్ట్రీమింగ్ చేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. అయితే ఈ స్ట్రీమింగ్‌ను పే అండ్ వ్యూ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చింది అమెజాన్.

మూడు రోజులు పాటు ఈ పే అండ్ వ్యూ పద్ధతి కొనసాగనుంది. జనవరి 6 నుండి ఇది అందరికి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. హిట్-2 ఓటిటికి వచ్చేసింది ఇక చూసేయొచ్చు అనుకున్న ఆడియన్స్ కి ఈ పే అండ్ వ్యూ విషయం తెలవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాని ఫ్రీగా చూడాలంటే శుక్రవారం వరకు ఎదురు చూడాల్సిందే మరి. కాగా ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని నిర్మించగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.