Hit-2 : ఓటిటికి వచ్చేస్తున్న హిట్-2.. అప్పుడేనా?

Kaburulu

Kaburulu Desk

December 20, 2022 | 06:20 PM

Hit-2 : ఓటిటికి వచ్చేస్తున్న హిట్-2.. అప్పుడేనా?

Hit-2 : సస్పెన్స్ థ్రిల్లర్ హీరో అడివి శేషు నుంచి ఈ ఏడాది వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ‘హిట్-2’. విడుదలకు ముందే భారీ హైప్‌ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అదే రేంజ్ లో అక్కట్టుకుంది. మరి ఇంతలా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఓటిటికి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Hit 2 : మిలియన్ డాలర్ల మార్క్‌ని అందుకున్న అడివి శేషు..

న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాని జనవరి ఫస్ట్ వీక్ లో విడుదల చేయడానికి మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ప్రసారం కానుంది. అయితే ఈ విషయంపై దర్శకనిర్మాతలు గాని, ఓటిటి సంస్థ గాని ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. కాగా ఈ సినిమా హిట్ యూనివర్స్ లో సెకండ్ కేసుగా తెరకెక్కింది.

నెక్స్ట్ కేసులో నేచురల్ స్టార్ నాని హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాలని నాని తన నిర్మాణ సంస్థ అయిన ‘వాల్ పోస్టర్ సినిమా’ పతాకంపై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని పక్కా మాస్ లుక్ లో దర్శనమివ్వబోతున్నాడు. వచ్చే నెలతో ఈ మూవీ షూటింగ్ పూర్తీ కానుంది.