Chiranjeevi : చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు.. మోడీతో సహా అంతటా అభినందనలు..

Kaburulu

Kaburulu Desk

November 21, 2022 | 11:15 AM

Chiranjeevi : చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు.. మోడీతో సహా అంతటా అభినందనలు..

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ మెగాస్టార్ గా ఎన్నో గొప్ప సినిమాలని ప్రేక్షకులకి అందించి లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు సాధించి, మంచి పనులతో ప్రజల మనిషిగా, తెలుగు రాష్ట్రాలకు అన్నయ్యగా, సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇప్పటికే సినిమాల్లో శిఖరం అంచుని చూసిన చిరంజీవికి మరో అవార్డు వరించింది.

ప్రస్తుతం గోవాలో 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ – 2022 పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి గాను చిరంజీవికి ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ అధికారికంగా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు.

Naga Shaurya Wedding : ఘనంగా హీరో నాగశౌర్య వివాహం..

గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజినీకాంత్, ఇళయరాజా లాంటి గొప్పవారికి ఇచ్చారు. ఈ సంవత్సరం చిరంజీవికి ఈ అవార్డుని ఇవ్వడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం మెగాస్టార్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.