Waltair Veerayya : బాస్ పార్టీ.. చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ఊర మాస్ సాంగ్..

Kaburulu

Kaburulu Desk

November 23, 2022 | 11:33 AM

Waltair Veerayya : బాస్ పార్టీ.. చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ఊర మాస్ సాంగ్..

Waltair Veerayya :  మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ లో వరుస సినిమాలు చేస్తున్నా ఒకప్పటి చిరంజీవి మాత్రం గుర్తురావట్లేదు. ఖైదీ నంబర్ 150లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత సినిమాలలో మాస్ ఎలిమెంట్స్ అంతగా లేవు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవిని మాస్ గా చూపించినా చిరుకి తగ్గ స్టెప్పులు, పాటలు లేవు. వీటన్నిటికీ సమాధానంగా బాబీ డైరెక్షన్ లో రాబోతున్న వాల్తేరు వీరయ్య ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపారు.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతుంది. మాస్ మహారాజ రవితేజ కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లాంచ్ లోనే ఊర మాస్ ఉండబోతుందని అర్థమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేశారు. బాస్ పార్టీ థీమ్ తో సాగే ఈ ఊర మాస్ సాంగ్ ని నేడు విడుదల చేశారు.

Adivi Sesh : హిట్ 2 ట్రైలర్.. హంతకుడు ఎవరు..? సస్పెన్స్ తో హిట్ ఖాయం..

ఈ పాటలో ఊర్వశి రౌతేలా చిరంజీవితో కలిసి చిందేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటని రచించి పాడాడు. దేవిశ్రీతో పాటు నకాష్‌ ఆశిష్‌, హరిప్రియా కలిపి ఈ బాస్ పార్టీ సాంగ్ ని పాడారు. ఈ పాటలో చిరంజీవి లుంగీకట్టి, షర్ట్ బటన్స్ విప్పి, లోపల బనియన్‌తో ఊరమాస్‌ లుక్‌లో ఉన్నారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.