Ali : పవన్ కళ్యాణ్‌ పై పోటీకి నేను సిద్ధం.. అలీ!

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగం వైపు వేరు వేరు అడుగులు వేశారు. తాజాగా అలీ, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 04:04 PM

Ali : పవన్ కళ్యాణ్‌ పై పోటీకి నేను సిద్ధం.. అలీ!

Ali : టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. అయితే వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగం వైపు వేరు వేరు అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇక అలీ ఏమో అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీలో కీలక పదవిలో కర్తవ్యం నిర్వహిస్తున్నాడు.

Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

తాజాగా అలీ, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అధిష్టానం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను. పవన్ కళ్యాణ్, నేను మంచి మిత్రులం. కానీ సినిమాలు వేరు రాజకీయాలు వేరు. ఇక్కడ విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం. ఎవరి సిద్ధాంతాలకు తగ్గట్టు వాళ్లు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

ఇక ఈ వ్యాఖ్యలు విన్న పవన్ అభిమానులు అలీ పై విమర్శల దాడి చేస్తున్నారు. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశమే ఉంటే జనసేనలో కూడా చేరవచ్చు. అధికారం కోసం పక్క పార్టీలో చేరి స్నేహితుడినే విమర్శిస్తున్నావా? పవన్ కళ్యాణ్ పైనే పోటీ చేయడానికి సిద్ధం అంటూ సవాళ్లు విసురుతావా? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఇటీవల అలీ కూతురు పెళ్లి జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అని అందరు అనుకున్నారు. ఇటీవల దీని పై అలీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, అది వర్కౌట్ అవ్వలేదు.

కాగా జగన్ ప్రభుత్వం అలీని గత ఏడాదిలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న కొన్ని టీవీ షోలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగాడు.