RRR : ‘నాటు నాటు’ సాంగ్ షూట్‌కి ముందు రామ్‌చరణ్ కాలుకి గాయం..

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఈ సాంగ్ షూట్ కి ముందు రామ్ చరణ్ కాలుకి గాయం..

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 04:44 PM

RRR : ‘నాటు నాటు’ సాంగ్ షూట్‌కి ముందు రామ్‌చరణ్ కాలుకి గాయం..

RRR : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలయ్యి నెలలు గడుస్తున్నా ఇంకా తన మానియాని కొనసాగిస్తుంది. ముఖ్యంగా విదేశీలు RRR క్రియేట్ చేసిన మ్యాజిక్ నుంచి బయటకి రాలేక పోతున్నారు. అయితే వీరికి ఈ సినిమాని ఇంత దగ్గర చేసింది ‘నాటు నాటు’ సాంగ్ అంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని రాజమౌళి కూడా అంగీకరించాడు.

RRR : చరణ్ నీరు లాంటి వాడు.. ఎన్టీఆర్!

వరల్డ్ వైడ్ గా ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సాంగ్.. ఇటీవలే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. అంతే కాదు క్రిటిక్స్ ఛాయస్ అవార్డుని, లాస్ ఏంజెల్స్ అవార్డుని కూడా అందుకుంది. ప్రస్తుతం ఆస్కార్ గెలుచుకోడానికి రేస్ లో ఉంది. ఇక ఈ సాంగ్ లో హీరోలు రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు మొత్తం ప్రపంచానే ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఇద్దరు ఒకే సింక్ లో స్టెప్పులు వేసి అదరగొట్టేశారు.

అయితే ఈ సాంగ్ షూట్ కి ముందు రామ్ చరణ్ కాలుకి గాయం అయ్యినట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కొమరం భీముడు’ సాంగ్ చిత్రీకరణకు ముందు సెకండ్-డిగ్రీ లిగమెంట్ టియర్‌ వచ్చింది. అయితే ఆ సాంగ్ లో డ్యాన్స్ మూవ్‌లు లేకపోవడంతో పెద్ద సమస్య అనిపించ లేదు. కానీ ఆ తరువాత ‘నాటు నాటు’ సాంగ్ సమయంలో చాలా కష్టమైంది. పర్‌ఫెక్ట్ సింక్ కోసం రాజమౌళి అండ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఎక్కడా రాజీ పడేవారు కాదు. దీంతో ఆ సమయంలో కొంచెం కష్టం అనిపించింది అంటూ వెల్లడించాడు. కాగా కాలుకి గాయం ఉన్నా రామ్ చరణ్ ఆ బాధని పేస్ లో కనిపించకుండా గ్రేస్ ఫుల్ గా చాలా బాగా చేశాడని ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ అంటున్నారు.