Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 07:00 PM

Pawan – Ali : పవన్‌తో గ్యాప్ గురించి మాట్లాడిన అలీ..

Pawan – Ali : తెలుగు సినీపరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మంచి స్నేహితులు. పవన్ సినిమాల్లో అలీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకానొక సమయంలో పవన్ కల్యాణే ఈ విషయం చెప్పుకొచ్చాడు. అయితే ఈమధ్య కాలంలో రాజకీయపరంగా వీరిద్దరి దారులు వేరుకావడం, అలీ కూడా పవన్ సినిమాల్లో కనిపించక పోవడంతో.. పవన్, అలీ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కథనాలు వచ్చాయి.

Balayya – Pawan : బాలయ్య సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్..

ఇక ఈ విషయాన్ని ‘అలీతో సరదాగా’ షోలో యాంకర్ సుమ, అలీని ప్రశ్నించింది. ‘మీరు, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు కదా, పలు ఆడియో లాంచ్ ఈవెంట్స్ లో కూడా పవన్ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. మరి ఇప్పుడు ఎందుకు మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది’ అని ప్రశ్నించగా.. ‘గ్యాప్ రాలేదు, గ్యాప్ క్రియేట్ చేశారు’ అంటూ అలీ బదులిచ్చాడు.

“మొన్న నా కూతురు పెళ్లి సమయంలో కూడా నేను శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళాను. నేను వస్తున్నాను అని ముందుగానే తెలుసుకొని, నాకు ఒక కుర్చీ ఏర్పాటు చేసి పెట్టారు. ఒక 15 నిముషాలు పాటు మేము ఇద్దరం మాట్లాడుకున్నాము. అయన పెళ్ళికి వస్తాను అని మాట ఇచ్చారు, అయన మేనేజర్ కూడా వచ్చి స్టేజి దగ్గర అంతా చూసుకొని వెళ్ళాడు.

అయితే ఫ్లైట్ మిస్ అవ్వడంతో అయన రాలేకపోయారు. ఈ విషయాలు ఏమి తెలియక.. అలీ అసలు ఆహ్వానించాడా? లేక పవన్ కల్యాణే కావాలని రాలేదా? అని ఇష్టమొచ్చినట్లు కథనాలు రాసేసి, మా ఇద్దరి మధ్య లేని గ్యాప్ ని క్రియేట్ చేస్తున్నారు అంతే. కావాలంటే మీరు పలు ఆడియో లాంచ్ లు నిర్వహిస్తుంటారు కదా. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ఎదురైతే ఆయనే అడగండి” అంటూ వెల్లడించాడు.