Home » devotional
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కల్యాణ లోవ గ్రామంలో గల రెజర్వాయిర్ దగ్గర పదహారు వండల ఏళ్ల సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించే వారట. ఆ కాలంలో కళ్యాణ లోవ కొండపై జాలువారిన పరమశివుని కన్నీటి చుక్కతో ఏర్పడినటువంటి ఆలయమే ఈ పోతురాజు స్వామి ఆలయం అని పూర్వీకులు చెబుతున్నారు. అదే ఈరోజు కళ్యాణ లోవ గా ప్రసిద్ధి చెందింది. పోతురాజు స్వామికి ఏడుగురు అక్క చెల్లెలు వున్నారు. వాళ్లంతా వేరువేరు చోట్ల గ్రామదేవతలుగా కరుణాకటాక్షాలతో ఆశీర్వదిస్తారని అక్కడి వారి […]
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేసే విధంగా మరో నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించే ఆలోచనలో ఉంది. తిరుమలలో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేసేలా తాటాకు బుట్టలను ప్రయోగత్మకంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ తాటాకులతో వివిధ సైజ్ ల్లో తయారు చేసిన […]
చార్‌ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 21 ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనందున చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకున్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి , గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల సందర్శన యాత్రను చార్‌ధామ్ అంటారని మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లానుకునేవారు రిజిస్ట్రేషన్ కోసం registrationandtouristcare.uk.gov.in అనే వెబ్‌సైట్‌కు […]
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో నేటి నుంచి గురుభక్తి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మూల బృందావనానికి పంచామృతం అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. 402 వ పట్టాభిషేకం సందర్భంగా మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు స్వామి […]
శివరాత్రి సందర్భంగా చార్ ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. శీతాకాలం కావడం, మంచుకురుస్తుండటంతో ఆరు నెలల పాటు కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. ఈ ఏప్రిల్ 22వ తేదీ నుంచి తిరిగి తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఛార్‌ధామ్ యాత్రకు సంబంధించిన 4 ఆలయ క్షేత్రాలు కూడా ఉత్తరాఖండ్‌లోనే ఉన్న నేపథ్యంలో.. యాత్రకు […]
మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్ష చేపట్టి శివాలయానికి వెళ్లి ఆదిదంపతులను దర్శించుకున్నారు. అయితే అదే రోజు మహా అద్భుతం చోటు చేసుకుంది. మహా శివుడి కంఠాభరణం అయిన నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవిశించిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది… మరి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇపుడు తెలుసుకుందాం.. నిర్మల్ జిల్లా దస్తూరబాద్ […]
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు ఏడో రోజు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు ఏ యే కార్యక్రమాలు జరిగాయో ఇపుడు తెలుసుకుందాం…! ముచ్చింతల్‌లో సమతా కుంభ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల నిత్య కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజు కల్హారోత్సవం […]
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశాలు. జీవనసారాన్ని తెలిపే ఈ గీతా మకరందాన్ని సమతామూర్తి క్షేత్రమైన రామానుజుల సన్నిధిలో ఏవిధంగా పఠనం చేశారో ఇపుడు తెలుసుకుందాం…! భగవద్గీత…! నేటి తరం విద్యార్థులకు పెద్దగా పరిచయం లేని పేరు. ఈ కాలం పిల్లలకు ఇందులోని శ్లోకాలు అంటే ఏంటో కూడా తెలియదు. కానీ […]
శ్రీ రాముడి వనవాసం తర్వాత జరిగిన రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినపుడు సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చేటపుడు ముత్యంపేట అనే ప్రదేశంలో కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టు పర్వతభాగముగా పిలుస్తున్నారు. మరి ఇంతటి చారిత్రక, పురాణ కథ ఉన్న ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏమిటో… అభివృద్ధి పనులు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం…! కొండగట్టు ఆలయ అభివృద్ధికి వందకోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు […]
పంచభూత శైవ క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని ఈ పేర్లకు అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు అని అర్థం. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి […]