Home » devotional
దేశ వ్యాప్తంగా హోళీ పండుగ సంబరాలు మిన్నంటాయి. విద్యా సంస్థల్లో, ఆఫీసుల్లో, ఆలయాల్లో, వివిధ సామాజిక ప్రదేశాల్లో, గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ఎక్కడ చూసినా రంగు రంగుల ఆటలు కన్నుల విందు చేశాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రాదయాలకు అనుగుణంగా హొలీ పండుగను జరుపుకుంటున్నారు. రంగులు, బెలూన్స్ , లేదా కోడి గుడ్లు, టమాటా వంటివి వాటితో రంగుల కేళీ హోలీని ఆడుతారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం విషపూరితమైన తేళ్లతో హొలీ వేడుకను జరుపుకుంటారు. ఎక్కడో, […]
వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని “పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం , భూమిపై దాడి చేశాడు. ఆ తర్వాత ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి […]
అహోబిల మఠం అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం సా.శ. 1400 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అవిభాజ్య కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది. ఇది ఆదివాన్ శతకోప స్వామికి ఆపాదించబడింది. ఈ క్షేత్రంలో అట్టహాసంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో… అక్కడి కల్యాణోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఇపుడు తెలుసుకుందాం…! నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రహ్లాద […]
తెలంగాణ రాష్ట్ర తిరుపతిగా పేరుగాంచిన వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవములు కన్నుల పండగలా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ప్రాతఃకాలారాధన, అర్చన, సేవా కాలము, నివేదన, శాంతి పాఠం, తీర్థ ప్రసాద గోష్టి వైభవంగా జరుతున్నాయి. చతుస్థానార్చన, మూల మంత్ర […]
నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో చెర్వుగట్టు గ్రామంలో ఒక అద్భుత ఆలయం వెలసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వలన ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన, కొండ దిగువున […]
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం […]
కలియుగ దైవంగా వెలసిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అనేకరకాల ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా సాలకట్ల తెప్పోత్సవం ఒకటి. మరి ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది దాని ప్రాముఖ్యత ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి […]
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత […]
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని ద్వీప దేవాలయం అని పిలుస్తారు. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో ఉంది. ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో వెలసింది. హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చాడని చెబుతారు. అంతర్వేది నిజానికి వశిష్ట నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. పురాణాల ప్రకారం, సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మ దేవుడు […]
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన స్వామి వారి దర్శనాలకు ఆన్ లైన్ లో డిమాండ్ పెరుగుతోంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ రిలీజ్ […]