Ahoblilam: వైభవంగా అహోబిల నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు… కన్నుల విందుగా కల్యాణోత్సవం…!

అహోబిల మఠం అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం సా.శ. 1400 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అవిభాజ్య కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది. ఇది ఆదివాన్ శతకోప స్వామికి ఆపాదించబడింది. ఈ క్షేత్రంలో అట్టహాసంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో… అక్కడి కల్యాణోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఇపుడు తెలుసుకుందాం…!
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రహ్లాద వరద స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది, బ్రహ్మోత్సవాలు ముఖ్యమైన స్వామి కళ్యాణోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా సాగింది ఉదయం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృతాల, క్షీరము లతో అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం విశేష అలంకరణలతో స్వామి గజవాహనంపై కొలువుదీరి ఆలయ పురవీధుల్లో వివరించారు రాత్రి స్వామి అమ్మవారికి రత్నాలు వజ్రాలతో పొదిగిన ఆభరణాలను అలంకరించారు అర్చకులు ఎదురుకోళ్లు తీసుకొని నృత్యం చేస్తూ స్వామివారికి సమర్పించారు. కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవాయిద్యాలు, భాజాభజంత్రీల మధ్య మాంగళ్య ధారణ జరిగింది. అర్చకులు వధూవరులపై తలంబ్రాలు పోసే దృశ్యం భక్తులకు కనువిందు కలిగించింది.