Bhagavadgitha Parayanam at Samathamurthy: సమతామూర్తి క్షేత్రంలో ఆశువుగా భగవద్గీత పఠనం చేసిన విద్యార్థులు…!

Kaburulu

Kaburulu Desk

February 9, 2023 | 11:01 PM

Bhagavadgitha Parayanam at Samathamurthy: సమతామూర్తి క్షేత్రంలో ఆశువుగా భగవద్గీత పఠనం చేసిన విద్యార్థులు…!

భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశాలు. జీవనసారాన్ని తెలిపే ఈ గీతా మకరందాన్ని సమతామూర్తి క్షేత్రమైన రామానుజుల సన్నిధిలో ఏవిధంగా పఠనం చేశారో ఇపుడు తెలుసుకుందాం…!

భగవద్గీత…! నేటి తరం విద్యార్థులకు పెద్దగా పరిచయం లేని పేరు. ఈ కాలం పిల్లలకు ఇందులోని శ్లోకాలు అంటే ఏంటో కూడా తెలియదు. కానీ సమతామూర్తి క్షేత్రంలో విద్యార్ధులు మాత్రం.. అవపోసన పట్టేశారు. భగవద్గీత.. ఉపనిషత్తుల సారం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగముతో పాటు భగవంతుని తత్వం, ఆత్మ స్వరూపాన్ని బోధించే గ్రంథం. పాశ్చాత్య పోకడలో పడి.. పురాతన భారతీయ సాహిత్యాన్ని మర్చిపోయే అవకాశం ఉన్న నేటి రోజుల్లో సమతామూర్తి క్షేత్రంలో విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను అవపోసన పట్టేస్తున్నారు.

సమతా క్షేత్రంలో విద్యార్థులు భగవద్గీతను అవపోసన పట్టారు. అధ్యాయం నంబర్ చెప్తే చాలు. శ్లోకం మొత్తాన్ని టపటపా చెప్పేస్తున్నారు. ఒక వేల శ్లోకం చెప్తే.. అది ఏ అధ్యాయంలో, ఎన్నో శ్లోకమనేది టపీమని చెప్పేస్తున్నారు. శ్లోకంలో మొదటి అక్షరాన్ని చెప్తే చాలు.. శ్లోకం మొత్తాన్ని చెప్తున్నారు. శ్రీ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన భగవద్గీత సూపర్ మెమోరియల్ టెస్ట్‌లో.. వేద విద్యార్థులు భగవద్గీతను నీళ్లు నమిలినట్టు నమిలేశారు.