RRR : RRR ‎ని పొగిడినప్పుడు ఒక్కడు మాట్లాడాల, కానీ ఇప్పుడు.. తమ్మారెడ్డి రియాక్షన్!

ఒక తెలుగు సినిమా ఆస్కార్ వేదిక వరకు వెళ్తుంది అని ఎవరు ఉహించి ఉండరు. కానీ వాటిని నిజం చేస్తూ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆస్కార్ వరకు మన సినిమాని తీసుకువెళ్లాడు. అయితే ఇటీవల టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR మూవీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Kaburulu

Kaburulu Desk

March 10, 2023 | 07:45 PM

RRR : RRR ‎ని పొగిడినప్పుడు ఒక్కడు మాట్లాడాల, కానీ ఇప్పుడు.. తమ్మారెడ్డి రియాక్షన్!

RRR : ఒక తెలుగు సినిమా ఆస్కార్ వేదిక వరకు వెళ్తుంది అని ఎవరు ఉహించి ఉండరు. కానీ వాటిని నిజం చేస్తూ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆస్కార్ వరకు మన సినిమాని తీసుకువెళ్లాడు. బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో టాలీవుడ్ కి ఒక గుర్తింపు తెచ్చిన జక్కన RRR మూవీతో ఏకంగా హాలీవుడ్ సినిమాలతోనే పోటీ పడే స్థాయికి తీసుకు వచ్చాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్.. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. నిజం చెప్పాలి అంటే మనకంటే హాలీవుడ్ ఆడియన్స్ RRR ని ఎక్కువుగా ఆదరించారు.

Ram Charan told the Greatness of Ayyappa Deeksha to Hollywood audience..

అందుకు ఉదాహరణ చెప్పాలి అంటే.. ఆస్కార్ మన ప్రభుత్వం RRR ని ఎంపిక చేయలేదు. కానీ హాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా ఆస్కార్ లో పోటీ చేయాలనీ తమ ప్రేమని చూపించి ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచేలా చేశారు. కేవలం హాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్‌బెర్గ్ కూడా RRR చిత్రం గురించి గొప్పగా మాట్లాడారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR మూవీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్కార్ గెలవడం కోసం RRR టీం ప్రమోషన్స్ అంటూ 80 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది. అదే 80 కోట్లు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి మొహాన కొడతాను అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు కాస్త టాలీవుడ్ లో ధుమారం లేపాయి. కె రాఘవేంద్రరావు, నాగబాబు లాంటి వాళ్ళు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో తమ్మారెడ్డి నేడు వివరణ ఇచ్చాడు.

క్రిందటి వారం సినిమా పరిశ్రమకు వద్దామనుకుంటున్న కొంతమంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాము. అందులో భాగంగా మాట్లాడుతూ.. రిలీజ్ అయ్యాక పేరు వచ్చే సినిమాలు ఉంటాయి, పేరు వచ్చాక రిలీజ్ అయ్యే సినిమాలు ఉంటాయి. అలాగే అవార్డులు, రివార్డులు కోసం తీసే సినిమాలు కూడా ఉంటాయి అంటూ విడమరిచి చెబుతున్నాను. ఈ క్రమంలోనే RRR మూవీ ఇప్పుడు ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు చేస్తుంది అని అన్నాను. కానీ ముందు చెప్పిన మాటలు అన్ని తీసేసి, కేవలం ఖర్చు చేశారు అనేదే పట్టుకొని చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేను అన్నదానిలో తప్పు ఉంటే ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ హద్దుమీరి బ్రతుకు, బాబులు అంటూ మాట్లాడుతున్నారు, అది బాధిస్తుంది. రెండు వారలు క్రిందట RRR గురించి ఒక వీడియో చేశా నా యూట్యూబ్ లో.. ఆ వీడియోలో ఆస్కార్ మన ఊహలో కూడా లేదు, కానీ నేడు 99 శాతం గెలిచేలా చేసిన రాజమౌళి గ్రేట్ అంటూ, కానీ ఆ రోజు ఒక్కడు మాట్లాడాల. ఈరోజు మాత్రం ప్రతి ఒక్కడు రియాక్ట్ అవుతున్నారు అంటూ వెల్లడించాడు.