ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్ అమెరికాలో ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే అమెరికా పాపులర్ టాక్ షో 'టాక్ ఈజీ'కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ పాటించే దీక్ష గురించి చెప్పమని ప్రశ్నించగా..

చరణ్ బదులిస్తూ.. 15 సంవత్సరాలు నుంచి నేను ఈ అయ్యప్ప దీక్షని ఆచరిస్తున్నాను.

దీక్ష 48 రోజులు ఉంటుంది. ఆ టైంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించి, చన్నీళ్లతో స్నానం చేయడం, చెప్పులు లేకుండా నడవడం, నేలపైనే పడుకొంటూ లగ్జరీ లైఫ్ లేకుండా బ్రతకాలి.

దీక్ష సమయంలో ఆడవారిని, భార్యని కూడా తాకకూడదు.

ఈ దీక్ష అనేది దైవ చింతనే జీవించేందుకు మాత్రమే కాదు..

మానసికంగా, శారీరకంగా దృడంగా మారేందుకు దీక్ష ఉపయోగపడుతుంది అంటూ.. దాని వెనుక ఉన్న సైన్స్ కూడా హాలీవుడ్ ప్రేక్షకులకు తెలియజేశాడు.

ఇక మన సంప్రదాయాన్ని ఇతర దేశాలకు కూడా పరిచయం చేస్తున్న రామ్‌చరణ్‌ని నెటిజెన్లు అభినందిస్తున్నారు.