RC15 Title and Poster : బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రామ్‌చరణ్.. RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
ఈరోజు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కావడంతో RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

RC15 Title and Poster : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం RC15 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి మరో తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. ఆల్రెడీ శంకర్ కి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ఉండడం, చరణ్ కి కూడా RRR తో పాన్ ఇండియా వైడ్ భారీ ఫాలోయింగ్ రావడంతో ఈ సినిమా పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు.
Ram Charan comments on Nepotism..
ఈరోజు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నీరెలీజ్ చేశారు. ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ గత కొన్నిరోజులుగా CEO, సేనాని టైటిల్స్ వినిపించాయి. కానీ ఇవేవి కాకుండా గేమ్ చెంజర్ (Game Changer) అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు రామ్ చరణ్. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక అలాగే ఈ సినిమాలోనే చరణ్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో రామ్ చరణ్ బైక్ పై కూర్చొని అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.
Ram Charan told the Greatness of Ayyappa Deeksha to Hollywood audience..
ఈ సినిమాలో చరణ్ తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇది కొడుకు పాత్రకి సంబంధించిన లుక్ అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ సినిమాతో చరణ్ అండ్ శంకర్ ఇండియన్ సినిమాలో గేమ్ చెంజర్ గా నిలుస్తారా? అనేది చూడాలి. కాగా కియారా అద్వానీ, అంజలి చరణ్ కి జంటగా కనిపిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
I couldn’t have asked for a better birthday gift !! #GameChanger
Thank you @shankarshanmugh sir!! @SVC_official @advani_kiara @DOP_Tirru @MusicThaman pic.twitter.com/V3j7svhut0
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2023