RRR : RRR పై తమ్మారెడ్డి వ్యాఖ్యలకు.. నాగబాబు, రాఘవేంద్రరావు కౌంటర్లు!

ఇటీవల టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR మూవీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు పై మెగా బ్రదర్ నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Kaburulu

Kaburulu Desk

March 10, 2023 | 08:10 PM

RRR : RRR పై తమ్మారెడ్డి వ్యాఖ్యలకు.. నాగబాబు, రాఘవేంద్రరావు కౌంటర్లు!

RRR : ఇటీవల టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR మూవీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్కార్ గెలవడం కోసం RRR టీం ప్రమోషన్స్ అంటూ 80 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది. అదే 80 కోట్లు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి మొహాన కొడతాను అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు కాస్త టాలీవుడ్ లో ధుమారం లేపాయి. మెగా బ్రదర్ నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. తమ్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు బడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

RRR : RRR ‎ని పొగిడినప్పుడు ఒక్కడు మాట్లాడాల, కానీ ఇప్పుడు.. తమ్మారెడ్డి రియాక్షన్!

ఈ నేపథ్యంలోనే రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదిక.. మిత్రుడు భరద్వాజ్ కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ? అంటూ ప్రశ్నించాడు.

ఇక నాగబాబు అయితే తీవ్ర స్థాయిలో ఆ వ్యాఖ్యలను ఖండించాడు. ఆస్కార్ బరిలో RRR నిలిచినందుకు కుళ్లుకుంటున్నారా? మీ వల్ల కుక్కకు కూడా ఉపయోగం లేదు. మీరేంటి, మీ సినిమా చరిత్ర ఏంటి? మీ పనికిమాలిన డెప్త్ ఏంటో మాకు తెలియదా? అసలు 80 కోట్లు ఖర్చు చేసినట్టు మీకెవరు చెప్పారు? అంటూ ప్రశ్నలు సందిస్తూనే, ముందు మీ బతుకు సరిగ్గా చూసుకోండి. ఏది పడితే అది మాట్లాడితే.. రాజమౌళి, కీరవాణి గారు ఊరుకున్నా మేము చూస్తూ ఊరుకోము. కంట్రోల్ యువర్ టంగ్ భరద్వాజ గారూ. మళ్ళీ ఈ విషయం పై మాట్లాడితే, లక్షరెట్లు ఎక్కువగా నేను రియాక్ట్ అవుతా అంటూ వ్యాఖ్యానించాడు.