RC 15 : రామ్ చరణ్ బర్త్‌డేకి.. RC 15 టైటిల్ పక్కా అంటున్న దిల్ రాజు..
చరణ్ నెక్స్ట్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ తో కలిసి భారీ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే సంక్రాంతికి చరణ్ -శంకర్ సినిమా...............

RC 15 : రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. RRR తర్వాత దేశవిదేశాల్లో చరణ్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక రీసెంట్ గా ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ మీడియాల్లో చరణ్ హంగామా చేశాడు. ఇండియాలోని పలు పెద్ద ఈవెంట్స్ కు చరణ్ కి గెస్ట్ గా పిలుస్తున్నారు. నార్త్ లో కూడా అనేక కార్యక్రమాలకు చరణ్ ని ఆహ్వానిస్తున్నారు.
చరణ్ నెక్స్ట్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ తో కలిసి భారీ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే సంక్రాంతికి చరణ్ -శంకర్ సినిమా రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు దిల్ రాజు. RC 15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూట్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకి CEO అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
తాజాగా ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజ్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా చరణ్ – శంకర్ సినిమా టైటిల్ ని కచ్చితంగా రిలీజ్ చేస్తాం అని చెప్పారు. చరణ్ పుట్టిన రోజు మార్చ్ 27 కావడంతో చరణ్ అభిమానులు ఈ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రచారంలో ఉన్న CEO అనే టైటిల్ నే ప్రకటిస్తారా లేక ఇంకేదైనా ప్రకటిస్తారా అని ఆలోచిస్తున్నారు. RRR తర్వాత రాబోతున్న మరో పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.