Rangamarthanda : నువ్వొక చెత్త నటుడివి.. ప్రకాష్ రాజ్ ని కొట్టిన బ్రహ్మానందం.. రంగమార్తాండ టీజర్ రిలీజ్..

రంగమార్తాండ సినిమా మార్చ్ 22న ఉగాది కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. తాజాగా రంగమార్తాండ టీజర్ ని...............

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 08:41 AM

Rangamarthanda : నువ్వొక చెత్త నటుడివి.. ప్రకాష్ రాజ్ ని కొట్టిన బ్రహ్మానందం.. రంగమార్తాండ టీజర్ రిలీజ్..

Rangamarthanda :  దాదాపు 6 సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో రాబోతున్నాడు. చివరగా 2017 లో నక్షత్రం సినిమా రిలీజ్ చేయగా అది ఫ్లాప్ అయింది. మరాఠీలో మంచి విజయం సాధించిన నట సామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేశాడు కృష్ణవంశీ. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ముఖ్య పాత్రల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

రంగమార్తాండ సినిమా మార్చ్ 22న ఉగాది కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. తాజాగా రంగమార్తాండ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ లో ఎక్కువగా ఏమి చూపించలేదు. సినిమాలో ఉన్న ముఖ్యమైన క్యారెక్టర్స్ అన్నీ రివీల్ చేశారు. టీజర్ మొదట్లో నేను నటుడ్ని అని చిరంజీవి వాయిస్ తో టీజర్ మొదలుపెట్టారు. ప్రకాష్ రాజ్ ని అందరూ సన్మానించడం, ఆ తర్వాత క్యారెక్టర్స్ అన్నీ రివీల్ చేశారు. చివర్లో బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ని కొట్టి నువ్వొక చెత్త నటుడివి అని తిడతాడు. చివర్లో రమ్యకృష్ణ నోర్ముయ్ అని అరుస్తుంది.

Sushanth : లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుశాంత్.. మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్..

టీజర్ లో ఎక్కువగా చూపించకపోయినా సినిమా కొత్తగా ఉండబోతుందని మాత్రం అర్ధమవుతుంది. సినిమాలో స్టార్ క్యాస్ట్ ఉండటం, బ్రహ్మానందం సీరియస్ రోల్ చేయడం, మెగాస్టార్ వాయిస్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి రంగమార్తాండ సినిమాతో అయినా కృష్ణవంశీ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.