KTR-Gudivada Amarnath: బిగ్ బ్రదర్ హైదరాబాద్.. యంగ్ బ్రదర్ వైజాగ్.. తెలుగు మంత్రుల వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 10:00 PM

KTR-Gudivada Amarnath: బిగ్ బ్రదర్ హైదరాబాద్.. యంగ్ బ్రదర్ వైజాగ్.. తెలుగు మంత్రుల వ్యాఖ్యలు!

KTR-Gudivada Amarnath: తెలుగు రాష్ట్రాల ఐటీశాఖ మంత్రులు కేటీఆర్, గుడివాడ అమర్నాథ్ రెండు రాష్ట్రాల నగరాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ హైదరాబాద్ ను బిగ్ బ్రదర్ అంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వైజాగ్ ను యంగ్ బ్రదర్ అంటూ సంభోదించారు. అంతేకాదు, ఏపీని సిస్టర్ స్టేట్ అంటూ కేటీఆర్ కొత్త పదాన్ని కూడా ప్రయోగించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారాయి.

ఈ మధ్య హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ను బిగ్ బ్రదర్ గా సంబోధించారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ లో ఏపీని ప్రమోట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. బిగ్ బ్రదర్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ను అప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు.

కాగా, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనుంది. మార్చి 3,4 తేదీలలో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న యంగర్ బ్రదర్ వైజాగ్, తోటి సోదరి రాష్ట్రం ఏపీకి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. అలానే ఏపీకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. అప్పుడు హైదరాబాద్ ను అమర్నాథ్ బిగ్ బ్రదర్ అని సంబోధిస్తే.. కేటీఆర్ వైజాగ్ ను యంగర్ బ్రదర్ అని పేర్కొనడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.